Chia Seeds: మీ పిల్లలు బలహీనంగా ఉన్నారా.. కచ్చితంగా డైట్‌లో ఇవి చేర్చండి..!

Chia Seeds:సాధారణంగా పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి తల్లిదండ్రులందరూ అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతారు.

Chia Seeds: మీ పిల్లలు బలహీనంగా ఉన్నారా.. కచ్చితంగా డైట్‌లో ఇవి చేర్చండి..!
Chea Seeds
Follow us

|

Updated on: Mar 06, 2022 | 9:18 PM

Chia Seeds:సాధారణంగా పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి తల్లిదండ్రులందరూ అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతారు. బలహీనంగా తయారువుతారు. కారణం వారి శరీరానికి సరైన ప్రొటీన్‌ ఫుడ్ అందకపోవడమే. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని పోషకాహారాలని డైట్‌లో చేర్చాలి. అందులో చియాగింజలు ఒకటి. ఇవి సాల్వియా హిస్పానికా మొక్క నుంచి లభిస్తాయి. ఇవి పిల్లల ఎదుగదలకి బాగా సహాయం చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉండే చియా విత్తనాలు తెలుపు, నలుపు రంగులో ఉంటాయి. వీటిని పిల్లలకు తినిపించడం ద్వారా అనేక వ్యాధుల నుంచి కాపాడవచ్చు. వీటిని పిల్లలకి ఎలా అందించాలో తెలుసుకుందాం. మీ బిడ్డ తరచుగా అలసిపోయినట్లు లేదా ఎముకలు బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తే వారానికి రెండుసార్లు చియా గింజలతో చేసిన ఆహారాలని తినిపించండి. ఇది ఎముకలను బలపరుస్తుంది వాటి అభివృద్ధికి సహాయపడుతుంది. చియా విత్తనాలలో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలంగా చేస్తాయి. ఇందులో ఇంకా మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలను కూడా ఉంటాయి. ఇవి ఎముకలకు చాలా అవసరం.

జ్ఞాపక శక్తి పెరగడానికి

తరచుగా పిల్లలు చాలా విషయాలు మరిచిపోతుంటారు. చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సరైన సమయంలో తీసుకుంటే నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చియాగింజలని ఏదో ఒకరూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

రోగనిరోధక శక్తి

కరోనా యుగంలో రోగనిరోధక శక్తి చాలా ముఖ్యమైంది. ఇది తక్కువగా ఉన్నవారికి అనేక రోగాలు సోకుతాయి. అందుకే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే చియా విత్తనాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు, పెద్దలు డైట్‌లో కచ్చితంగా చియా విత్తనాలను చేర్చుకోవాల్సిందే.

పిల్లలకు ఇలా తినిపించండి

చియా విత్తనాలని పిల్లలకి పాలలో కలిపి తినిపించవచ్చు. చియా గింజలకి ఇతర గింజలు కలిపి తినిపించవచ్చు. పిల్లలకు పెరుగు అంటే చాలా ఇష్టం కాబట్టి పెరుగులో చియా గింజలను కలిపి కూడా తినిపించవచ్చు. మీకు కావాలంటే పిల్లల కోసం చియా సీడ్స్ కుకీలను కూడా తయారు చేయవచ్చు. చియా గింజల్లో ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ, నిపుణులను సంప్రదించిన తర్వాతే ఆహారంలో చేర్చుకోవాలి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!

Ration card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ తప్పులు చేస్తున్నారా క్షణాల్లో కార్డు రద్దు..!

అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు తెగ ఇష్టపడుతారు.. పెళ్లికి వెంటనే ఓకె చెబుతారు..!