Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!

Eyesight: ఇటీవల కాలంలో చాలామంది కళ్ల సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకు ఉంటున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మారిన జీవన పరిస్థితులు,

Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!
Eyesight
Follow us
uppula Raju

|

Updated on: Mar 06, 2022 | 9:55 PM

Eyesight: ఇటీవల కాలంలో చాలామంది కళ్ల సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకు ఉంటున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మారిన జీవన పరిస్థితులు, ఆహారం, తదితర విషయాల వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇవి మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. తరచుగా తలనొప్పి, అస్పష్టమైన చూపు, కళ్ళు ఎర్రబడటం వంటివి కంటి చూపు మందగించడానికి ముందు ఎదురయ్యే లక్షణాలు. ఇవి కనిపిస్తే అస్సలు విస్మరించవద్దు. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. అనేక కారణాల వల్ల కంటి చూపు తగ్గినప్పటికీ ఇందులో నాడీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. నరాల సంబంధిత సమస్యలు చిన్న వయస్సులోనే అస్పష్టమైన దృష్టికి లేదా కంటి చూపు తగ్గడానికి కారణమవుతాయి. అందుకే చాలామంది చిన్నవయసులోనే చూపు కోల్పోతారు.

ఇది కాకుండా జన్యుపరంగా కూడా కళ్ల సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులకు అల్బినిజం వ్యాధి లేదా రెటినిటిస్ పిగ్మెంటోసా ఉన్నట్లయితే పిల్లలకి కూడా ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో్సారి అనుకోకుండా అంధత్వం సంభవిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు హైపర్‌టెన్సివ్ రెటినోపతికి గురయ్యే ప్రమాదం ఉంది. హెల్త్‌లైన్ ప్రకారం.. మీ రక్తపోటు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రెటీనా రక్తనాళాల గోడలు చిక్కగా మారే అవకాశం ఉంది. ఇది రక్త నాళాలు కుంచించుకుపోవడానికి కారణం అవుతుంది. ఇది రక్తాన్ని రెటీనాకు చేరకుండా నియంత్రిస్తుంది. సుదీర్ఘమైన అధిక రక్తపోటు రెటీనా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దాని పనితీరును పరిమితం చేస్తుంది. కంటిలోని సూక్ష్మ నరాల మీద ఒత్తిడి తెస్తుంది. ఇది క్రమంగా చూపు సమస్యలని కలిగిస్తుంది. చివరకి అంధత్వం వస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం.. దానంతట అదే నడుస్తుంది.. కారణం ఏంటో తెలుసా..!

Chia Seeds: మీ పిల్లలు బలహీనంగా ఉన్నారా.. కచ్చితంగా డైట్‌లో ఇవి చేర్చండి..!

ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!