- Telugu News Photo Gallery Hair care tips Foods you should eat on an empty stomach For better hair growth
Hair Care Tips: జుట్టు రాలిపోతోందా? కరివేపాకు, అవిసెగింజలు, వేపాకులు..! రోజూ పరగడుపున..
Hair care tips at home: కాలుష్యం, ఆహార అలవాట్లు, ఆరోగ్య సమస్యలు కారణాలేమైతేనేమి.. అపురూపంగా చూసుకునే జుట్టు కళ్ల ముందే రాలిపోతుంటే ఎంతో బాధగా ఉంటుంది. ఐతే ఈ చిట్కాలు పాటించారంటే మీ జుట్టు పట్టుకుచ్చులా పెరిగి అందంగా తయారవుతుంది.
Updated on: Mar 07, 2022 | 9:35 AM

కరివేపాకులో ఉండే విటమిన్ సి, ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 3 - 4 ఆకులను తిన్నారంటే కొన్ని రోజుల్లోనే జుట్టు పెరుగుదలలో మార్పులను మీరే చూస్తారు.

జుట్టుకు అవసరమైన ఒమేగా-3 అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పరగడుపున అవిసె గింజలు నానబెట్టిన నీటిని లేదా అవిసె గింజల పొడిని నీటిలో కలుపుకుని అయినా తాగొచ్చు.

సహజ ఔషధంగా పేరుగాంచిన వేప ఆకులు పొట్టకే కాకుండా జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెప్పేమాట.

కొబ్బరి నీరు ఆరోగ్యానికేకాకుండా.. జుట్టు, చర్మం, జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడతాయి. సిట్రస్ పండ్ల రసాన్ని ఖాళీ కడుపుతో వారానికి మూడు సార్లు త్రాగాలి. ఐతే మీకు ఆరోగ్య సమస్యలున్నట్లయితే, నిపుణుల సలహా మేరకు తీసుకోవడం బెటర్!




