AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం.. దానంతట అదే నడుస్తుంది.. కారణం ఏంటో తెలుసా..!

Infinity Train: నేటి కాలంలో సైన్స్ చాలా పురోగతి సాధించింది. నిన్నటి వరకు అసాధ్యం అనిపించిన విషయాలు కూడా నేడు ప్రజలకు చిన్నవిగా మారాయి. ఇంతకు ముందు రైలు

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం.. దానంతట అదే నడుస్తుంది.. కారణం ఏంటో తెలుసా..!
Infinity Train
uppula Raju
|

Updated on: Mar 06, 2022 | 9:20 PM

Share

Infinity Train: నేటి కాలంలో సైన్స్ చాలా పురోగతి సాధించింది. నిన్నటి వరకు అసాధ్యం అనిపించిన విషయాలు కూడా నేడు ప్రజలకు చిన్నవిగా మారాయి. ఇంతకు ముందు రైలు నడవాలంటే ఇంధనం అవసరం ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా స్వయంగా దానికదే ఛార్జ్‌ అవుతూ నడిచే రైలు వస్తోంది. ఇందులో బొగ్గు లేదా డీజిల్ అవసరం ఉండదు. కేవలం గురుత్వాకర్షణ శక్తితో నడవగలదు. ఈ రైలు ఆస్ట్రేలియాలోని ఓ మైనింగ్ కంపెనీ తయారు చేస్తోంది. ఇంధనం లేకుండా నడిచే ఈ రైలును ఇన్ఫినిటీ రైలు అని పిలుస్తారు. ఈ రైలు అతి ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే కాలుష్య స్థాయి తగ్గించడం. అంతేకాకుండా రైలులో ఇంధనం నింపే ఇబ్బంది కూడా ఉండదు. ఈ రైలు వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. ఇనుప ఖనిజాలని తక్కువ సమయంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయవచ్చు.

మైనింగ్ కంపెనీ ఫోర్టెస్క్యూ ఈ సాంకేతికతపై పని చేస్తుంది. ఈ రైలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లేటప్పుడు స్వయంచాలకంగా ఛార్జ్ అవుతుంది. దాని శక్తి ఎప్పటికీ అయిపోదు. 244 బోగీలుండే ఈ రైలులో 34,404 టన్నుల ఇనుప ఖనిజం నింపుతారు. అప్పుడు రైలు మరింత బరువుగా మారుతుంది. ఈ రైలు ఖాళీగా వచ్చేటప్పుడు స్వయంచాలకంగా గురుత్వాకర్షణ శక్తితో ఛార్జ్ అవుతుంది. ఫోర్టెస్క్యూ సీఈఓ ఎలిజబెత్ గెయిన్స్ మాట్లాడుతూ..

ఈ రైలు ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తివంతమైన, సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ రైలుగా నిలుస్తుందని తెలిపారు. ఈ రైలు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాడకం తగ్గిపోతుంది. దీనివల్ల పెరుగుతున్న కాలుష్యం సమస్య తగ్గుతుంది. నేటి కాలంలో చాలా కార్లలో బ్రేక్‌ వేసినప్పుడు వాటికవే రిఛార్జ్‌ అయ్యే సాంకేతికతని వాడుతున్నారు. ఇదే సాంకేతికతని ఇప్పుడు ఇన్ఫినిటీ రైలులో ఉపయోగిస్తున్నారు.

Chia Seeds: మీ పిల్లలు బలహీనంగా ఉన్నారా.. కచ్చితంగా డైట్‌లో ఇవి చేర్చండి..!

Ration card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ తప్పులు చేస్తున్నారా క్షణాల్లో కార్డు రద్దు..!

అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు తెగ ఇష్టపడుతారు.. పెళ్లికి వెంటనే ఓకె చెబుతారు..!