AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఇక నుంచి అన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ లోనే.. ఎందుకో తెలుసా..?

WhatsApp: టీకా స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి, ఇనాక్యులేషన్ సర్టిఫికేట్‌లను(Official Documents) డౌన్‌లోడ్ చేసుకోవడానికి గత సంవత్సరం ప్రభుత్వం ప్రారంభించిన WhatsApp చాట్‌బాట్.. తాజాగా అధికారిక పత్రాలను యాక్సెస్ చేయడానికి వన్ స్టాప్ గమ్యస్థానంగా మారనుంది.

WhatsApp: ఇక నుంచి అన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ లోనే.. ఎందుకో తెలుసా..?
Whats App
Ayyappa Mamidi
|

Updated on: Mar 07, 2022 | 8:38 AM

Share

WhatsApp: టీకా స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి, ఇనాక్యులేషన్ సర్టిఫికేట్‌లను(Official Documents) డౌన్‌లోడ్ చేసుకోవడానికి గత సంవత్సరం ప్రభుత్వం ప్రారంభించిన WhatsApp చాట్‌బాట్.. తాజాగా అధికారిక పత్రాలను యాక్సెస్ చేయడానికి వన్ స్టాప్ గమ్యస్థానంగా మారనుంది. దీని ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, ఆదాయపన్ను సర్టిఫికెట్, పాన్ కార్డు వంటి వాటిని వినియోగదారులు కేవలం వాట్సాప్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు పరీక్ష దశలో ఉందని అధికారులు తెలిపారు. అధికారికంగా ఈ సేవలను రానున్న కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వినియోగదారులు తమ డిజీలాకర్ లో భద్రపరచిన వివిధ డాక్యుమెంట్లను వాట్సాప్ చాట్‌బాట్ అనుసంధానించటంతో ఇది సాధ్యమవనుంది. ఈ విధానంలో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ పద్ధతిలో డిజీలాకర్ ను యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. ఈ సేవలు వేగవంతంగా లభించనున్నాయి. అంటే ఇకపై ఫిజికల్ గా వివిధ డాక్యుమెంట్లను మనతో పాటు తీసుకువెళ్లాల్సిన కష్టాలు తప్పనున్నాయి. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నందున ప్రభుత్వం దీని పేరును MyGov Corona Helpdesk నుంచి MyGov Helpdesk గా మార్చింది. దీని ద్వారా పౌరులకు పైన చెప్పినట్లుగా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇది పౌరుల హెల్త్ లాకర్ గా కూడా పనిచేయనుందని.. ఆరోగ్యానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు ఇందులోనే స్టోర్ చేసుకునే వెసులుబాటు రానుందని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో చాట్ బాట్ సేవలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో చాట్ బాట్ ద్వారా వేరువేరు సేవలను అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్నాయి.

ఇవీ చదవండి..

ITC Stock: ఐటీసీ ఇన్వెస్టర్లకు గోల్డెన్ డేస్.. కంపెనీ తాజా రిటర్న్స్ విశ్లేషణ మీకోసం..

Chitra ramakrishna: ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్ర దిల్లీలో అరెస్ట్.. కో-లొకేషన్ స్కామ్ కేసులో సెబీ చర్యలు..