TTD: వివాదాస్పదంగా టీటీడీ నిర్ణయాలు.. ఆ విషయంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత.. చివరికి
టీటీడీ(TTD) పాలకమండలి ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పందంగా మారుతోంది. ఫలితంగా టీటీడీ (TTD) తీవ్ర విమర్శలపాలవుతోంది. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం, కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం...
టీటీడీ(TTD) పాలకమండలి ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పందంగా మారుతోంది. ఫలితంగా టీటీడీ (TTD) తీవ్ర విమర్శలపాలవుతోంది. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం, కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు, హోటళ్ల మూసివేత అంశం కూడా కారణాలుగా వినిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయంలో(Tirumala Temple) నిర్వహించే ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తారు. వాటికి హజరైన భక్తులు స్వామివారికి భారీగానే కానుకలు సమర్పిస్తారు. సుప్రభాత సేవ మొదలుకుని, వీఐపీ బ్రేక్ దర్శనం సమయానికి మూడో వంతు హుండీ ఆదాయం వస్తోంది. దీంతో పరిమిత సంఖ్యలో జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుతో భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ఆలయంలో రెండేళ్లుగా భక్తులను ఆర్జిత సేవలకు(Arjitha seva in Tirumala Temple) అనుమతించడం లేదు. దర్శనానికీ పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలకమండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై చర్చ నిర్వహించారు. సేవా టికెట్ల రేట్లను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. ఈ అంశంపై విమర్శలు రావడంతో ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా మారింది.
తాజాగా వివాదాస్పద అంశాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు పెంపు అంశంపై అలాంటి ఆలోచనే లేదని పాలకమండలి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు తిరుమలలో హోటళ్లు మూసివేస్తామన్న నిర్ణయం కూడా పెను వివాదంగా మారింది. తిరుమల కొండపై ఉండే వ్యాపారులందరూ టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. శ్రీవారినే నమ్ముకుని జీవిస్తున్న తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వ్యాపారుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఈ విషయంలోనూ పాలకమండలి వెనుకడుగు వేసింది.
Also Read
Russia – Ukraine War: పుతిన్ వెనకున్నది ఆ ముగ్గురే.. యుద్ధానికి విరామం ఇచ్చింది కూడా అందుకేనట..!