C-MET Jobs 2022: రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ కొలువులు! సీమెట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (CMET) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
C-MET Kerala Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (CMET) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 16
పోస్టులు: ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు.
అర్హతలు:
- ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు కెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.49,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులకు ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/డాక్టోరల్ డిగ్రీ (కెమిస్ట్రీ/ఫిజిక్స్/మెటీరియల్స్ సైన్స్/ఎలక్ట్రానిక్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Administrative Officer, Centre for Materials for Electronics Technology, Shornur Road, Athani, Mulankunnathukavu P.O., Thrissur-680581, Kerala.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: