IIT Delhi Jobs 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. నెలకు రూ.79 వేల జీతం!
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
IIT Delhi Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (అడ్మిన్), ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.
పే స్కేల్: నెలకు రూ.29,200ల నుంచి రూ.79,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/బీటెక్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ అడ్రస్: achawla.projects@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: