AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్‌సీ15' అనే వర్కింగ్‌ టైటిల్‌ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది.

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..
Ramcharan
Basha Shek
|

Updated on: Mar 06, 2022 | 7:02 PM

Share

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ15’ అనే వర్కింగ్‌ టైటిల్‌ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో రాజమండ్రిలోని ఓ హోటల్‌ ఉన్న రామ్‌చరణ్‌ (Ram Charan)కు తాపేశ్వరం సురుచి వర్మ ‘బాహుబలి’ కాజాను అందజేశారు. కాగా జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి గౌరవ పూర్వకంగా బాహుబలి కాజా (Bahubali kaja)ను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. చరణ్‌ తో పాటు డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కు కూడా ఈ కాజాను బహుమతిగాఅందించారు సురుచి వర్మ.

కాగా కొన్నినెలల క్రితం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్‌ కోసం రాజమండ్రికి వచ్చిన శర్వానంద్‌, రష్మిక లకు కూడా బాహుబలి కాజాను బహుమతిగా అందించారు. అంతకుముందు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సమంత వంటి ప్రముఖులకు కూడా బాహుబలి కాజా అందింది. కాగా రాజమండ్రి షెడ్యూల్‌ పూర్తి కాగానే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో బిజీ కానున్నాడు రామ్‌ చరణ్‌. భారీ బడ్జెట్‌ తో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు చెర్రీ నటించిన ఆచార్య కూడా ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.

Also Read:Lifestyle Diseases: 2030 నాటికి తీవ్ర ప్రమాదంలోకి ప్రజారోగ్యం.. పరిశోధకుల హెచ్చరికలు!

మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.45,000 ఆదాయం అందించండి..

IIT Delhi Jobs 2022: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.79 వేల జీతం!