Sonakshi Sinha: చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు.. కారణమేమిటంటే..
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సోనాక్షి- సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సోనాక్షి- సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడం తెలిసిందే. వాటిపై ఘాటుగా స్పందించిన దబాంగ్ బ్యూటీ ‘రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫోటకు తేడా తెలియదా?’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non bailable warrant) జారీ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఓ ఈవెంట్ నిర్వాహకుడు సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను అడ్వాన్సుగా రూ. 37లక్షలు కూడా చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు సోనాక్షి. దీంతో డబ్బులు తనకు తిరిగివ్వాలని ఈవెంట్ నిర్వాహకుడు సోనాక్షి సిన్హా మేనేజర్ ను సంప్రదించాడు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. సోనాక్షి కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో న్యాయం కోరుతూ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఛీటింగ్ కేసు పెట్టాడు.
కేసు విచారణలో భాగంగా యూపీలోని మొరాబాద్ జిల్లాలోని లోకల్ కోర్టుకు సోనాక్షి హాజరు కావాల్సింది ఉంది. అయితే సిన్హా హాజరు కాలేదు. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే తేది ఏప్రిల్ 24న సోనాక్షిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. కాగా 2018 సెప్టెంబర్ 30లో ఢిల్లీలో ‘ఇండియాస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్’ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోనాక్షి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేయాల్సి ఉంది. అయితే ఈవెంట్ ఆర్గనైజర్ సరిగా లేడని, మీడియా ద్వారా తన పేరును ఉపయోగించి డబ్బు సంపాధించాలనుకుంటున్నాడని దబాంగ్ బ్యూటీ పేర్కొంది. దీనిపై ట్వి్ట్టర్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది. అప్పట్లో అది సమసిపోయిందనుకున్నారు. అయితే తాజాగా కోర్టు దాకా ఈ వ్యవహారం వెళ్లింది. మరి న్యాయస్థానం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Meanwhile.
Arrest warrant issued by a local court against actress Sonakshi Sinha in a 2019 fraud case registered against her in UP’s Moradabad district. pic.twitter.com/7PCDPpSi1k
— Piyush Rai (@Benarasiyaa) March 5, 2022
పొలిటికల్ హీట్ పెంచిన ఆయన పాదయాత్ర.. వేడి పుట్టిస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు