Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Radhe Shyam First Review: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజాహెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ ఈ ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..
Radheshyam
Follow us
Basha Shek

|

Updated on: Mar 06, 2022 | 8:20 PM

Radhe Shyam First Review: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజాహెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ ఈ ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ అలనాటి హీరోయిన్‌ భాగ్యశ్రీ, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుతో పాటు జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సుమారు రూ. 300కోట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లకు మంచి అపూర్వ స్పందన వచ్చింది. తాజాగా సెన్సార్‌ కార్యాక్రమాలను పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌ ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో ప్రభాస్ (Prabhas) సినిమా కోసం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఊహించని స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రాధేశ్యామ్‌ సినిమా గురించి ఫస్ట్‌ రివ్యూ ఇచ్చాడు.

ప్రభాస్‌, పూజాల కెమిస్ట్రీ ఎలక్ర్టిఫైయింగ్‌.. ‘ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ సినిమా చూశాను. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయి. సినిమాలో ప్రభాస్‌- పూజాల కెమిస్ట్రీ అదిరిపోయింది. క్లైమాక్స్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇది ఒక యూనిక్‌ సబ్జెక్ట్‌. ఒక్క మాటలో చెప్పాలంటే రాధేశ్యామ్‌.. క్లాసిక్‌, స్టైలిష్‌, థ్రిల్లింగ్‌, మిస్టరీ అండ్‌ మోస్ట్‌ రొమాంటిక్‌ సినిమా. ఎప్పటిలాగే ప్రభాస్‌ అదరగొట్టేశాడు. సినిమాలో అతని యాక్టింగ్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ చూడముచ్చటగా ఉంది. ఇండియాలో ప్రభాస్‌ క్లాస్‌, స్టైల్‌ను బీట్‌ చేసేవాళ్లే లేరు’ అంటూ సినిమాను ఆకాశానికెత్తేశాడు. కాగా ఉమైర్‌ సంధు గతంలో పలు సినిమాలకు కూడా ఇలాగే రివ్యూలు ఇచ్చాడు. అతను చెప్పినట్లే కొన్ని సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలవగా, మరికొన్ని అంచనాలు అందుకోలేకపోయాయి. మరి రాధేశ్యామ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:NTPC Jobs 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో..నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో 97 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు..

షాకింగ్.. విపరీతమైన జలుబు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయిన మహిళ.. వీడియో

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..