AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బన్నీతో ఛాన్స్‌ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ.. అదిరిపోయిన ప్రోమో..

మెహబూబా, గల్లీ రౌడి సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది నేహాశెట్టి (NehaShetty). అయితే కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.

Allu Arjun: బన్నీతో ఛాన్స్‌ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ.. అదిరిపోయిన ప్రోమో..
Allu Arjun
Basha Shek
|

Updated on: Mar 06, 2022 | 8:12 PM

Share

మెహబూబా, గల్లీ రౌడి సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది నేహాశెట్టి (NehaShetty). అయితే కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు. అయితే సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తో కలిసి ఆమె నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) ఆ కొరతను తీర్చేసింది. ఫిబ్రవరి12న విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాలో నేహ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ డీజే టిల్లు లవర్‌ కు పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ అవకాశం సినిమాలో కాదు ఒక యాడ్ లో.

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు బన్నీ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నేహాతో కలిసి పుష్పరాజ్‌ చేసిన కొత్త యాడ్‌ ప్రోమో విడుదలైంది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఈ వీడియోలో ‘బ‌న్నీగారు కొంచెం ఫాస్ట్‌గా చేద్దామా..అని నేహాశెట్టి అడుగుతుంటే..హీరో ఎంట్రీ క‌దా ఆ మాత్రం ఉండాలి..అని బ‌న్నీ అంటాడే. మీరిలా రౌండ్ రౌండ్ తిరుగుతుంటే ఉన్నట్లుండి ఫిజ్జా తినాలనిపిస్తుంది.. అని నేహాశెట్టి అంటుంటే..వెంట‌నే బ‌న్నీ ఫోన్‌లో జొమాటో యాప్‌ను చూపిస్తూ.. ఫిజ్జా అయినా పెస‌ర‌ట్టు అయినా జొమాటో ఉందిగా అని అంటాడు’. ఎంతో ఇంప్రెసివ్‌ గా ఉన్న ఈ ప్రోమో యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబడుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప2 సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టాడు బన్నీ. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read:షాకింగ్.. విపరీతమైన జలుబు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయిన మహిళ.. వీడియో

Digital TOP 9 NEWS: హెలికాప్టర్‌ను కూల్చేశారు.. పాలు తాగుతున్న నంది విగ్రహం !! వీడియో

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..