Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్‏బాస్. అందుకు తగ్గట్లే ప్రేక్షకాదరణతో విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది.

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..
Mumaith Khan
Follow us

|

Updated on: Mar 06, 2022 | 9:41 PM

బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్‏బాస్. అందుకు తగ్గట్లే ప్రేక్షకాదరణతో విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. కాగా బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదం అందించడం కోసం ‘బిగ్‏బాస్ నాన్ స్టాప్’ (Bigg Boss Non Stop) అంటూ ఏకంగా 24 గంటల స్ట్రీమింగ్‌ ను ఓటీటీలో తీసుకొచ్చారు. గత నెల 26న ప్రారంభమైన ఈ షోలోకి గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వారియర్స్‏గా.. కొత్తవారు చాలెంజర్స్‏గా ఎంట్రీ ఇచ్చారు. ఇక గత సీజన్ల మాదిరిగానే ఈ రియాలిటీ షోలోనూ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కాగా మొదటివారం ఎలిమినేషన్‌ కోసం మిత్రశర్మ, ఆర్జే చైతు, నటరాజ్‌ మాస్టర్‌, అరియానా, సరయు, హమీదా, ముమైత్‌ ఖాన్ లు నామినేట్‌ అయ్యారు. చాలామంది మిత్రశర్మ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. అయితే అనూహ్యంగా ముమైత్‌ఖాన్‌(Mumaith khan) హౌస్‌ నుంచి బయటకు వచ్చింది.

కావాలనే నన్ను బ్యాడ్‌ చేశారు.. కాగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో సరయు, ముమైత్ ఖాన్‌లు చివరి వరకు మిగిలారు. అయితే ముమైత్‌ కు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు. కాగా ఎలిమినేషన్‌ సమయంలో నవ్వుతూ కనిపించిన ఈ డ్యాన్సర్‌ స్టేజీ మీదకు రాగానే కన్నీటిపర్యంతమైంది. ‘మొదటి బిగ్‌ బాస్‌ సీజన్‌లో పడిన మార్క్‌ను తొలిగించుకునేందుకు ఇక్కడ అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు ఇంత త్వరగా బయటకు వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. ఎంతో బాధగా ఉంది. నన్ను కావాలనే బ్యాడ్ చేశారు.. బయటకు కూడా అలానే చూపించారు’ అంటూ కొందరి కంటెస్టెంట్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ముమైత్. కాగా ఎలిమినేషన్‌ ప్రక్రియ అనంతరం విలువైన వ్యక్తులు (Worthy), పనికిరాని వాళ్లు( Waste) అనే ట్యాగ్‌ ఎవరెవరికి ఇస్తారు? అని ముమైత్‌ను నాగార్జున ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అఖిల్‌, అజయ్‌, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్‌, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్‌ ట్యాగ్‌ ఇస్తానని ముమైత్‌ చెప్పుకొచ్చింది.

Also Read:Project Engineer Jobs 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? మెరిట్‌ ఆధారంగా బెల్‌లో 55 వేల జీతంతో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం.. దానంతట అదే నడుస్తుంది.. కారణం ఏంటో తెలుసా..!

Ind Vs Sl: శ్రీలంకపై సూపర్‌ విక్టరీ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎంతంటే..