Ind Vs Sl: శ్రీలంకపై సూపర్ విక్టరీ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎంతంటే..
Srilanka Tour Of India: దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన పరాజయాలను మరిపిస్తూ టీమిండియా సొంత గడ్డపై అదరగొట్టింది. మొహాలి వేదికగా జరిగిన మొదటి టెస్టులో లంకేయులను మూడు రోజుల్లోనే మట్టికరిపించింది
Srilanka Tour Of India: దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన పరాజయాలను మరిపిస్తూ టీమిండియా సొంత గడ్డపై అదరగొట్టింది. మొహాలి వేదికగా జరిగిన మొదటి టెస్టులో లంకేయులను మూడు రోజుల్లోనే మట్టికరిపించింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రతిభకు తోడు, అశ్విన్ స్పిన్ మాయజాలం తోడవ్వడంతో ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. అంతేకాదు మొదటి సారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ రోహిత్ (Rohit sharma) కు, వందో టెస్టు ఆడుతున్న విరాట్‌కు మొహాలి టెస్టు మధురానుభూతిని మిగిల్చింది. అయితే తాజా విషయంలో ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-2023 పాయింట్ల పట్టిక (WTC Points Table)లో టీమిండియా స్థానంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. రోహిత్ సేన ఐదో స్థానంలోనే కొనసాగుతోంది.
గత డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ రన్నరప్ అయిన టీమిండియా 2021-23 సీజన్‌కు గానూ ఇప్పటివరకు 10 టెస్ట్‌లు ఆడి ఐదింట గెలిచి మూడింట ఓడిపోయింది. రెండు టెస్ట్ మ్యాచ్‌లను డ్రాతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 65 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో అదరగొట్టి ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2021-23 సీజన్‌కు గానూ ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన ఆసీస్ నాలుగింట గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 52 పాయింట్లు ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ ఇప్పటి వరకు మూడు సిరీస్‌లు ఆడగా రెండు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓడి, ఒకటి డ్రా చేసుకుని ఆరో స్థానంలో కొనసాగుతోంది.
The latest #WTC23 standings after India’s big win in the first #INDvSL Test ? pic.twitter.com/ECmTOqQNvl
— ICC (@ICC) March 6, 2022
ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!