Yadadri Bhuvanagiri News: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి..

Yadadri Bhuvanagiri News: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఢీ కొని.. నలుగురు వ్యక్తులు..

Yadadri Bhuvanagiri News: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి..
Road Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 06, 2022 | 5:36 PM

Yadadri Bhuvanagiri News: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఢీ కొని.. నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్‌ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన బస్సు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ట్రాక్టర్ కాస్తా పని చేస్తున్న కూలీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు స్పాట్‌లోనే చనిపోయాగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also read:

IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. మొదటి మ్యాచ్‌ ఎప్పుడంటే..

NMDC Recruitment 2022: గేట్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.50,000ల జీతంతో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు!

బాబోయ్ పులి.. యువకుడి పై దాడి చేసి.. ఇంకెవరైనా చిక్కుతారేమోనని ఆశగా ఎదురు చూసి