IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. మొదటి మ్యాచ్‌ ఎప్పుడంటే..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అభిమానులకు శుభవార్త. ఐపీఎల్‌- 2022 సీజన్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది.

IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. మొదటి మ్యాచ్‌ ఎప్పుడంటే..
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: Mar 06, 2022 | 6:13 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అభిమానులకు శుభవార్త. ఐపీఎల్‌- 2022 సీజన్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. 15వ సీజన్ లో  భాగంగా మార్చి 26 న మొదటి మ్యాచ్‌ జరగనుండగా, మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మొదటి మ్యాచ్‌ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కాగా  ఐపీఎల్‌-15 సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుంది. మొత్తం 70 లీగ్‌ మ్యాచ్ లు జరుగనున్నాయి. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి.  మే22న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా… పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బ్రబోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. ఈసారి మొత్తం 12 డబుల్ హెడర్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ 3.30లకు ప్రారంభంకానుండగా .. రాత్రి మ్యాచ్ గం. 7.30లకు  స్టార్ట్ కానుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ పోరు ముగుస్తుంది. ప్లే ఆఫ్స్ తేదీలను.. ఫైనల్ వేదికను త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు.

గ్రూప్-ఏ(టీమ్స్)

ముంబై ఇండియన్స్

*కోల్‌కతా నైట్ రైడర్స్

*రాజస్థాన్ రాయల్స్

*ఢిల్లీ క్యాపిటల్స్

*లక్నో సూపర్ జెయింట్స్

గ్రూప్ -బీ (టీమ్స్)

*చెన్నై సూపర్ కింగ్స్

*సన్‌రైజర్స్ హైదరాబాద్

*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

*పంజాబ్ కింగ్స్

*గుజరాత్ టైటాన్స్

Ipl2022

Ipl2022

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!