Ind Vs Sl: లంకను చుట్టేసిన స్పిన్నర్లు.. మొహాలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం.. సిరీస్‌లో 1-0 ఆధిక్యం..
రవీంద్ర జడేజా (175 పరుగులు, 9 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రతిభకు తోడు అశ్విన్ మాయాజాలం తోడవ్వడంతో మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.
రవీంద్ర జడేజా (175 పరుగులు, 9 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రతిభకు తోడు అశ్విన్ మాయాజాలం తోడవ్వడంతో మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో లంకేయులను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్ల ప్రతిభతో ఈ టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కాగా తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా అటు రోహిత్ శర్మకు.. అలాగే వందో టెస్టుగా విరాట్ కోహ్లీకి మొహాలీ టెస్ట్ ఎన్నో మధురజ్ఞాపకాలను అందించింది. సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మార్చి(12-16) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. కాగా ఓవర్ నైట్ స్కోరు108/4తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకకు ఓవర్‌నైట్ బ్యాటర్లు అసలంక (29), నిసాంక (61) శుభారంభం అందించారు. ఒకానొకదశలో 161/5తో మెరుగైన స్థితిలో నిలచింది. అయితే ఎప్పుడైతే అసలంక ఔట్యాడో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. జడేజా టెయిలెండర్ల భరతం పట్టడంతో మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 174 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ చుక్కలు..
సుమారు 400 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంకకు జడేజా, అశ్విన్ లు మరోసారి చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా ఒక్కడే అజేయంగా 51 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. ధనంజయ డిసిల్వా (30), మాథ్యూస్ (28), కరుణరత్నె (27), అసలంక (20) నిరాశపర్చారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన జడేజా రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అశ్విన్ కూడా నలుగురిని పెవిలియన్‌కు పంపించాడు. షమీ రెండు వికెట్లు సాధించాడు. ఇక భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 574/8 వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా(175 నాటౌట్) వీర విహారం చేయగా. వికెట్ కీపర్ రిషభ్ పంత్ 96 పరుగులు చేశాడు. హనుమ విహారి (58), అశ్విన్ (61) అర్ధ సెంచరీలతో రాణించారు.
Huge victory!
India win by an innings and 222 runs to take a 1-0 series lead against Sri Lanka ?#WTC23 | #INDvSL | https://t.co/mo5BSRmFq2 pic.twitter.com/76hsYd9yKF
— ICC (@ICC) March 6, 2022
Also Read:CHALO CARD: బస్సు చెల్లింపులకు ఛలో కార్డ్.. త్వరలో వాటర్ మెట్రో..
Janhvi Kapoor: 25వ పుట్టినరోజు శ్రీవారి సన్నిధిలో జరుపుకున్న జాన్వీ కపూర్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
MEIL: పుణె రహదారులపై మరో 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించిన ప్రధాని మోదీ