పొలిటికల్ హీట్ పెంచిన ఆయన పాదయాత్ర.. వేడి పుట్టిస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు

పొలిటికల్ హీట్ పెంచిన ఆయన పాదయాత్ర.. వేడి పుట్టిస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు
Political Heat In Anantapur

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేను పాదయాత్ర చేస్తున్నా అంటూ అనంతపురం(Anantapur) లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన పాదయాత్ర పొలిటికల్ హీట్ పెంచింది. ప్రభాకర్ చౌదరి అనంతపురం మాజీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి....

Ganesh Mudavath

|

Mar 06, 2022 | 5:46 PM

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేను పాదయాత్ర చేస్తున్నా అంటూ అనంతపురం(Anantapur) లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన పాదయాత్ర పొలిటికల్ హీట్ పెంచింది. ప్రభాకర్ చౌదరి అనంతపురం మాజీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. 2019 ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక అనంత వెంకట్రామిరెడ్డి(Ananta Venkat Rami Reddy) స్టైల్ చాలా భిన్నం. నాలుగు సార్లు ఎంపీగా పని చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎక్కడా ప్రభాకర్ చౌదరి(Prabhakar Chowdary) మాజీ ఎమ్మెల్యే పై కామెంట్ చేయలేదు. అయితే అతని అనుచరులు మాత్రం రోజూ ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనికి వైసీపీ నేతలు అప్పుడప్పుడు స్పందించడం షరా మామూలే. కానీ వారం రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే చౌదరి.. తాను పాదయాత్ర చేస్తానని చేసిన ప్రకటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

పాదయాత్రకు ముందే మాజీ ఎమ్మెల్యే పై వైసీపీ నేతలు, ప్రత్యేకించి ఎమ్మెల్యే అనంత చేసిన కామెంట్స్ రాజకీయ కాక పుట్టించింది. మొన్నటి వరకు మీరే కదా అధికారంలో ఉన్నది. ఉన్నన్ని రోజులు అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితోనూ, అలాగే మేయర్ స్వరూపతో తగువులు పెట్టుకుని నగరానికి గాలికొదిలేశారని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ పనీ చేయని వారు ఇప్పుడు పాదయాత్ర చేస్తామనంటూ జనంలోకి రావడం హాస్యాస్పదంగా ఉందని రియాక్ట్ అయ్యారు. దీనికి మాజీ ఎమ్మెల్యే చౌదరి కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. మీ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని నాలుగు రోజుల పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, అధికార పార్టీ వైఫల్యాలు ఏంటో చూపిస్తానని తేల్చి చెప్పారు. అన్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే నాలుగు రోజులు పాదయాత్ర చేశారు.

అయితే పాదయాత్ర చేసిన నాలుగు రోజులు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రోజూ మాజీ ఎమ్మెల్యే చౌదరి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వాటికి కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు అందరూ కౌంటర్లు ఇవ్వడంతో పాదయాత్రకు భారీ క్రేజ్ వచ్చింది. పాదయాత్రలో కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కనిపించడంతో పార్టీలో కొత్త జోష్ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పాదయాత్రపై మాత్రం సెటైర్లు బాగా వినిపించాయి. కేవలం నాలుగు రోజుల పాదయాత్రకు ఒక హైటెక్ బస్సు ఏర్పాటు చేసుకుని హైటెక్ యాత్ర చేశారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే తన పోరాటాన్ని పాదయాత్రతోనే ముగిస్తారా లేక ఇంకో రూపంలో కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

Also Read

IIT Delhi Jobs 2022: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.79 వేల జీతం!

Women Health: మహిళలకి ఆ సమయంలో ఈ 7 ఆహారాలు అత్యవసరం.. ఎందుకంటే..?

Telangana: బ్రేక్‌పాస్ట్‌లో బొద్దింక.. లంచ్‌లో కప్పపిల్ల.. ట్రిపుల్ ఐటీ హాస్టల్లో కలుషిత ఆహారం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu