మానవత్వం మరిచిన మామ.. కోడలిపై కన్నేసి దారుణం.. ఆఖరుకు

తండ్రిలా భరోసా ఇవ్వాల్సిన మామ మానవత్వాన్ని మరిచాడు. కోడలిని కూతరిలా ఆదరించాల్సింది పోయి ఆమెపై లైంగిక(Sexual Assault) దాడి చేసేందుకు యత్నించాడు. మంచివాడిలా నటించి, సమయం చూసి...

మానవత్వం మరిచిన మామ.. కోడలిపై కన్నేసి దారుణం.. ఆఖరుకు
Warangal Crime News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 06, 2022 | 9:27 PM

తండ్రిలా భరోసా ఇవ్వాల్సిన మామ మానవత్వాన్ని మరిచాడు. కోడలిని కూతరిలా ఆదరించాల్సింది పోయి ఆమెపై లైంగిక(Sexual Assault) దాడి చేసేందుకు యత్నించాడు. మంచివాడిలా నటించి, సమయం చూసి తన కర్కశ కోరికను బయటపెట్టాడు. కోడలు వద్దని కోరినా, వదిలేయాలని బతిమాలినా ఆయన మనసు కరగలేదు. చివరికి కోడలు ఎదురుతిరిగే సరికి కాల్చి చంపాడు(Murder). హర్యానా(Haryana)లోని పల్వాల్ జిల్లా అలీగఢ్ రోడ్డులోని కిత్వాడి కాలనీలో ఓ అమ్మాయికి కొత్తగా పెళ్లై అత్తారింట్లో అడుగు పెట్టింది. పైళ్లైన కొన్ని రోజులు ఆమెను భర్త, అత్తామామలు బాగా చూసుకున్నారు. అదను చూసి తన నిజ స్వరూపం బయటపెట్టాడు మామ మోహన్ సింగ్. కాళ్లు నొప్పులుగా ఉన్నాయి, నొక్కమని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కోడలు వద్దని వారించినా వినేవాడు కాదు ఆ దుర్మార్గుడు. తన కామ వాంఛ తీర్చమని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం విని అవాక్కయిన బాధితురాలు.. అత్తను తల్లిలా భావించి జరిగిన సంగతి చెప్పింది. కోడలిని కూతురులా భావించి మంచీ చెడు చూసుకోవాల్సిన అత్త సైతం మామకే వంత పాడింది. ఆ తర్వాత ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని, నోరు మూసుకుని కూర్చోవాలని వేధించేవాడు.

వారి మనసులో నుంచి బయటపడ్డ దురాలోచనలకు ఆ కోడలు తట్టుకోలేకపోయింది. వారితో వాదనకు దిగింది. బాగా చూసుకుంటామని చెప్పి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించింది. దీంతో మామ ఈ సారి మరింతగా రెచ్చిపోయాడు. ఎలాగైనా కోడలిని లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. అయినా బాధితురాలు అతనికి లొంగలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన మామ.. ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కోడలిని భర్త, అత్తామామలు కాల్చి చంపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Also Read

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

అందమైన దేవకన్యలా ప్రియాంక అరుల్​ మోహన్ ఫోటోస్

IIT Delhi Jobs 2022: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.79 వేల జీతం!