Fuel Prices: మళ్లీ పెట్రో బాంబ్‌.. బాదుడే బాదుడు.. సామాన్యుడిపై మోయలేని భారం..

పెట్రోల్‌ రేటు 150 రూపాయలకు చేరుతుందా? 12 నుంచి 25రూపాయల వరకు పెరిగే అవకాశముందా..? అది రేపటి నుంచే అమలులోకి రాబోతోందా..? అంటే..అవుననే సమాధానమే వస్తోంది.

Fuel Prices: మళ్లీ పెట్రో బాంబ్‌.. బాదుడే బాదుడు.. సామాన్యుడిపై మోయలేని భారం..
Fuel Prices
Follow us

|

Updated on: Mar 07, 2022 | 10:55 AM

Fuel prices on March 7: పెట్రోల్‌ రేటు 150 రూపాయలకు చేరుతుందా? 12 నుంచి 25రూపాయల వరకు పెరిగే అవకాశముందా..? అది రేపటి నుంచే అమలులోకి రాబోతోందా..? అంటే..అవుననే సమాధానమే వస్తోంది. అవును..ఉక్రెయిన్‌లో పుతిన్ సేన బాంబుల మోత మోగిస్తుంటే.. ఆ రీ సౌండ్‌ వరల్డ్‌ వైడ్‌గా ప్రతిధ్వనిస్తోంది. ఉక్రెయిన్‌, రష్యా వార్‌..ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 14 ఏళ్లలో మొదటిసారి 140 డాలర్లకు చేరింది బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర. 2008 నుంచి ఇదే అత్యధిక రేటు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరగనున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్‌ లీటరుకు దాదాపు 12 నుంచి 25 రూపాయల వరకు పెంచే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ఇవాల్టితో ముగుస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌ రేట్స్‌ పెరిగే ఛాన్సుందని అంటున్నారు నిపుణులు. ఇదే జరిగితే సామాన్యుని జేబుకు చిల్లుపడటం ఖాయమంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా, యూరప్‌ దేశాలు పరిశీలిస్తున్నాయి. దీంతో క్రూడ్‌ ధర మరింత పెరుగుతోంది.

సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు రోజూ ధరలను సవరిస్తాయి. ఐతే మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. కానీ ఉక్రెయిన్‌ సంక్షోభంతో ధరలు అమాంతం ఆకాశానికంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైపైకి కదులుతున్నాయి. దీని ప్రభావంతో పెట్రోల్‌ ధరలు 150కి చేరే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇక బంగారం ధర 60వేల రూపాయలను టచ్ చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,800గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 60వేలకు పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు.

Also Read: మార్చి 6.. భారత క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేని రోజు.. ఏకంగా 3 గుడ్‌న్యూస్‌లు

Latest Articles