Tax optimiser: జీతం పెరిగి మీరు పన్ను పరిధిలోకి వచ్చారా.. అయితే ఇలా పన్నును 66 శాతం తగ్గించుకోండి..
Tax optimiser: విశాఖకు చెందిన ప్రియాంకకు కంపెనీలో జీతం పెంపు వచ్చింది. ఈ పెంపు వల్ల ఆమె ఆదాయం టాక్స్(Tax View) పరిధిలోకి వచ్చింది.
Tax optimiser: విశాఖకు చెందిన ప్రియాంకకు కంపెనీలో జీతం పెంపు వచ్చింది. ఈ పెంపు వల్ల ఆమె ఆదాయం టాక్స్(Tax View) పరిధిలోకి వచ్చింది. శాలరీ స్ట్రక్చర్(Salary Structuring) టాక్స్ ఫెండ్లీగా ఉన్నప్పటికీ.. ఆమె ఆదాయ పన్ను కింద వచ్చే మినహాయింపులను పొందలేకపోతోంది. ఆమె ఆర్థిక సలహాదారును కలవగా.. అతని సూచన మేరకు ఇంటి అద్దె ఎక్కువగా చెల్లించటం వల్ల ఆమె లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపును పొందింది. దీనికి తోడు ఆమె శాలరీ స్ట్రక్చర్ లో చేసిన కొన్ని మార్పుల వల్ల నేష్నల్ పెన్షన్ స్కీమ్ లో సొమ్మును పెట్టుబడిగా పెట్టింది. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ప్రియాంక గతంలో నెలకు రూ.15 వేలు అద్దె చెల్లించేంది. ఇంతకు ముందు ఆమెకు అంతే హెచ్ఆర్ ఏ వచ్చేది. కానీ తాజాగా పెరిగిన జీతం వల్ల రూ. 25 వేలు హెచ్ఆర్ ఏ లభిస్తోంది. దీనిని టాక్స్ ఫ్రీ గా మార్చాలంటే ఆమె రూ.31 వేలు అద్దె చెల్లిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఆమె చెల్లించాల్సిన టాక్స్ సుమారు రూ. 42 వేల వరకు తగ్గుతుంది.
దీనికి తోడు ఆమె తన కంపెనీని ఎన్పీఎస్ సౌలభ్యాన్ని అందిచమని కోరాలి. తద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్-80CCD(2) కింద ఆమె పొందుతున్న బేసిక్ శాలరీలో 10 శాతం వరకు పన్ను రహింతగా మారుతుంది. ఒకవేళ ఆమె జీతంలో 10 శాతం అంటే రూ. 6250 ని ప్రతి నెలా ఎన్పీఎస్ చెల్లిస్తే.. దాని వల్లు చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 23,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనికి తోడు ఆమె మరో రూ. 50 వేల స్వంతంగా ఎన్పీఎస్ లో జమచేస్తే మరో రూ. 15,600 టాక్స్ రిడక్షన్ పొందవచ్చు. దీనికి అదనంగా ఆమె కంపెనీ ద్వారా గాడ్జెట్స్, మెడికల్ గ్రూప్ కవరేజ్ పొదటం వల్ల మరో రూ. 19,500 వరకు పన్ను తగ్గించుకోవచ్చు. ఇలా చెల్లించాల్సిన టాక్స్ మెుత్తం రూ.1,52,942 నుంచి రూ. 52,562కు తగ్గుతుంది. ఇలా ఉద్యోగులు చెల్లించాల్సిన టాక్స్ మెుత్తాన్ని సరైన ఆర్థిక సలహాదారును సంప్రదించటం ద్వారా తగ్గించుకోవచ్చు.
ఇవీ చదవండి..
Market News: వారాలు మారుతున్నా వదలని వార్ భయాలు.. భారీ నష్టాలతో ఎరుపెక్కిన భారత మార్కెట్లు..
WhatsApp: ఇక నుంచి అన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ లోనే.. ఎందుకో తెలుసా..?