AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Share Buyback: టీసీఎస్ సంచలన నిర్ణయం.. వాటిని మళ్లీ రిటర్న్ చేసుకుంటున్న టెక్ దిగ్గజం..

TCS Share Buyback: భారత్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ(Tata Consultancy Services) మెగా షేర్ బయ్ బ్యాక్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 18 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలును మార్చి 9 నుంచి ప్రారంభించనుంది.

TCS Share Buyback: టీసీఎస్ సంచలన నిర్ణయం.. వాటిని మళ్లీ రిటర్న్ చేసుకుంటున్న టెక్ దిగ్గజం..
Tcs
Ayyappa Mamidi
|

Updated on: Mar 07, 2022 | 11:06 AM

Share

TCS Share Buyback: భారత్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ(Tata Consultancy Services) మెగా షేర్ బయ్ బ్యాక్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 18 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలును మార్చి 9 నుంచి ప్రారంభించనుంది. ఈ అవకాశం మార్చి 25తో ముగియనుంది. ఇందులో భాగంగా ఒక్కో షేర్ ను కంపెనీ ప్రకటించిన తేదీ మార్కెట్ రేటుకు 17 శాతం అదనంగా చెల్లించి లేదా రూ. 4500 ఒక్కొక్క షేరుకు చెల్లించి కొనుగోలు చేస్తామని టీసీఎస్ ప్రకటించింది. టీసీఎస్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ షేర్ల కొనుగోలు ఇప్పుడు జరుగుతున్నది నాలుగవ సారి. గతంలో జరిగిన లావాదేవీల్లోనూ టాటా సన్స్ అత్యధికంగా లాభపడ్డారు.

టీసీఎస్ రిజర్వు క్యాటగిరీ నుంచి 60 లక్షల షేర్లు, జనరల్ క్యాటగిరీ నుంచి 3.4 కోట్ల షేర్లను వెనుకకు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఒక షేర్ హోల్డర్ కలిగి ఉన్న మెుత్తంలో 14.61 శాతం షేర్లను ఈ బయ్ బ్యాక్ లో పాల్గొని కంపెనీకి తిరిగి అమ్మవచ్చు. దీనికోసం కంపెనీ పాన్ కార్డు వివరాలను, డీమాట్ వివరాలను కలిపి ఉపయోగించనుంది. అర్హత కలిగిన షేర్ హోల్డర్లు ఎక్స్ఛేంజ్ ఇచ్చే సపరేట్ విండో(Separate Window) ద్వారా తమ వాటాలను కంపెనీకి అమ్మవచ్చు. టాటా సన్స్ ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన నేపథ్యంలో తాజా చర్య వెలువడింది. సంస్థ ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు చెల్లించనుండగా, మిగిలినవి రుణాల చెల్లింపుకు వెళ్తాయి. ప్రస్తుతం టీసీఎస్‌లో టాటా సన్స్‌కు 72 శాతం వాటా ఉంది.

ఇవీ చదవండి..

Tax optimiser: జీతం పెరిగి మీరు పన్ను పరిధిలోకి వచ్చారా.. అయితే ఇలా పన్నును 66 శాతం తగ్గించుకోండి..

WhatsApp: ఇక నుంచి అన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ లోనే.. ఎందుకో తెలుసా..?