సచిన్ రికార్డ్‌ బ్రేక్ చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.. త్వరలో ఇండియాటీంలో చోటు సంపాదిస్తాడు..!

సచిన్ రికార్డ్‌ బ్రేక్ చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.. త్వరలో ఇండియాటీంలో చోటు సంపాదిస్తాడు..!
Sarfaraz Khan

Ranji Trophy 2022: సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌లో అతని బ్యాట్ చెలరేగుతోంది. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు.

uppula Raju

|

Mar 07, 2022 | 1:25 PM

Ranji Trophy 2022: సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌లో అతని బ్యాట్ చెలరేగుతోంది. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. దీంతో ముంబై జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఫామ్‌ ఇలాగే కొనసాగితే ముంబై టైటిల్‌ను గెలుచుకోవడం ఖాయం. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 137.75 సగటుతో 526 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 1 అర్ధ సెంచరీ సాధించాడు. అత్యధిక స్కోరు 275 పరుగులు. ఇది సౌరాష్ట్రపై సాధించాడు. తర్వాత ఒడిశాపై 165 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నమెంట్‌లో అతని అత్యల్ప స్కోరు 48 పరుగులు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. అయితే సర్ఫరాజ్ ఖాన్ అంత సులువుగా క్రికెటర్ కాలేదు. ఆయనను ఈ స్థాయికి తీసుకురావడానికి అతడి తండ్రి చాలా కష్టపడ్డాడు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆజాద్ మైదాన్‌కు ప్రాక్టీస్ కోసం తీసుకెళ్లేవాడు. 24 ఏళ్ల సర్ఫరాజ్ 1997 అక్టోబర్ 22న జన్మించాడు. అతను తన మొదటి క్రికెట్ పాఠాన్ని తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. క్రికెట్ కమిట్‌మెంట్ కారణంగా అతను పాఠశాలకు వెళ్లలేకపోయినప్పుడు తండ్రి ప్రైవేట్ ట్యూటర్‌ను ఏర్పాటు చేశాడు.

2009లో కేవలం 12 ఏళ్ల వయసులో హారిస్ షీల్డ్ గేమ్‌లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడంతో సర్ఫరాజ్ ఖాన్ తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. 421 బంతుల్లో 439 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 68 బౌండరీలు ఉన్నాయి. ఇందులో 56 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. త్వరలో అతను ముంబై అండర్ 19 జట్టులో ఆ తర్వాత ఇండియా అండర్ 19లో చోటు సంపాదించాడు.

రంజీ క్రికెట్‌లో సగటు 77.74

సర్ఫరాజ్‌ స్వస్థలం యూపీలోని అజంగఢ్‌. కానీ అతను ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడతాడు. అతని రంజీ అరంగేట్రం 2014లో బెంగాల్‌పై జరిగింది. అప్పటి నుంచి అతను 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 77.74 సగటుతో 2099 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 6 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు చేశాడు. ఇందులో 301 పరుగులు అతని అత్యధిక స్కోరు.

Protein Rich Food: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్‌ కచ్చితంగా అవసరం.. ఈ వెజిటేబుల్స్‌ని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..!

Ricky Ponting: షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంటూ ఏడ్చిన రికీ పాంటింగ్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Hair Growth: జుట్టు పెరుగుదల కోసం పరగడుపున ఇవి తింటే బెటర్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu