Tragedy: ఘోరం..చనిపోయిన సోదరునికి నివాళులు అర్పించబోయి..అదే చోట..అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు!
కొన్ని సంఘటనలను విధి విచిత్రం అనాలో.. చేజేతులా అనాలో అర్ధం కాదు. ఎలా అనుకున్నా సరే నిండుప్రాణాలు గాలిలో కలిసిపోవడం మాత్రం విషాదాన్ని మిగులుస్తుంది.
Tragedy: కొన్ని సంఘటనలను విధి విచిత్రం అనాలో.. చేజేతులా అనాలో అర్ధం కాదు. ఎలా అనుకున్నా సరే నిండుప్రాణాలు గాలిలో కలిసిపోవడం మాత్రం విషాదాన్ని మిగులుస్తుంది. అందులోనూ వారం వ్యవధిలో ముగ్గురు బిడ్డలు ఒకే విధంగా ప్రాణాలను కోల్పోతే ఇక విషాదానికి అంతే ఉండదు. సరిగ్గా ఇటువంటి విషాదమే చోటుచేసుకుంది నార్త్ కరోలినాలో. వారం రోజుల క్రితం ప్రమాదంలో చనిపోయిన తమ సోదరునికి అదే ప్రదేశంలో నివాళులు అర్పించాలని ఇద్దరు సోదరులు చేసిన ప్రయత్నంలో వారి ప్రాణాలూ అదే విధంగా రైలు కింద పడి నలిగిపోయాయి. సంఘటన పూర్తి వివరాలు అక్కడి పోలీసులు తెలిపినదాని ప్రకారం ఇలా ఉన్నాయి.
బాల్తాజార్ టిక్విరామ్ ఉస్(27) అనే యువకుడు ఈస్ట్ హెబ్రాన్ స్ట్రీట్ మీదుగా డ్రైవింగ్ చేస్తుండగా, జులై 26 న లైట్ రైలు ఢీకొని చనిపోయాడు. దీంతో అతని ఇద్దరి సోదరులు తీవ్రమైన విషాదానికి గురయ్యారు. అదేశోకంతో వారు తమ సోదరునికి నివాళులు అర్పించాలని ప్రమాదస్థలం వద్దకు చేరుకున్నారు. పాబ్లో టిక్విరామ్ ఉస్(29), జోస్ చిలంబలం టిక్విరామ్ అస్(20) షార్లెట్‌లోని రైలు పట్టాలపై ఉత్తరాన నడుస్తూ 8200 సౌత్ బౌలేవార్డ్ వద్ద షార్లెట్ ఏరియా ట్రాన్సిట్ సిస్టమ్ (CATS) లింక్స్ (లైట్ రైల్) ఢీ కొట్టడంతో చనిపోయారు. ఈ మేరకు రైలు, షార్లెట్-మెక్లెన్‌బర్గ్ పోలీస్ (CMPD) ఒక పత్రికా ప్రకటన వెలువరించింది.
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. “వారి సోదరుడు మరణించిన వారం రోజులు కావడంతో నివాళులు అర్పిస్తున్నారు.. అతను చనిపోయిన ప్రదేశం దగ్గర వారు స్మారక చిహ్నాన్ని నిర్వహిస్తున్నారు,” అని CMPD సార్జంట్. ఆడమ్ జోన్స్ విలేకరుల సమావేశంలో చెప్పారు.దురదృష్టవశాత్తు, ఇద్దరు సోదరులు కూడా కాలినడకన వెళ్తుండగా రైలు ఢీకొట్టింది అంటూ ఆయన వివరించారు. ఈ ఘటన వీడియో దృశ్యాలు ఇద్దరు సోదరులు ట్రాక్ మీద నిలబడ్డారని ధృవీకరించాయి, అయితే రైలు రాకముందే వారు ఎంతసేపు ట్రాక్‌పై ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు. వారు కొవ్వొత్తులను వెలిగించి, “ట్రాక్‌లపై తమకు సాధ్యమైనంత ఉత్తమంగా అతనికి నివాళి అర్పిస్తున్నారు” అని జోన్స్ చెప్పారు. క్రాసింగ్ చేతులు, లైట్లు, కొమ్ములతో సహా అన్ని భద్రతా చర్యలు ఆ సమయంలో సరిగ్గా పని చేస్తున్నాయని ఆయన చెప్పారు.
ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ఇదేవిధంగా రైలు ఢీకొట్టడంతో చనిపోయారు. వీరిలో నలుగురు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదాలు జరిగాయని నిర్ధారించారు. అందుకే ఇప్పుడు అక్కడి పోలీసులు పౌరులను హెచ్చరిస్తున్నారు. ”మీరు మద్యం సేవిస్తే.. జాగ్రత్తగా ఉండండి. మీ కారుకు డ్రైవర్ ను నియమించుకోండి. వీలుకాకపోతే ఎక్కడివారు అక్కడ ఉండండి.” అని వారు చెబుతున్నారు.
ఏదేమైనా ఒకే ప్రాంతంలో రక్తం పంచుకుపుట్టిన ముగ్గురు ఒకే విధంగా మరణించడం మాత్రం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.
Also Read: మంటల్లో గ్రీస్ దేశం.. నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు.. సాయానికి పలు దేశాలు సిద్ధం
4లక్షల మద్యం బాటిల్ మిస్..!! ఆచూకీ కోసం అమెరికా బిజీ..!! వీడియో