మంటల్లో గ్రీస్ దేశం.. నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు.. సాయానికి పలు దేశాలు సిద్ధం

గ్రీస్ దేశం మంటల్లో మండిపోతోంది. కార్చిచ్చు చుట్టుముట్టడంతో అనేక ప్రాంతాల్లో వేలాది కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. నగరాలకు నగరాలు మంటల ధాటికి త;ల్లడిల్లుతున్నాయి.

మంటల్లో గ్రీస్ దేశం.. నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు.. సాయానికి పలు దేశాలు సిద్ధం
Greece Fires Cities
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 08, 2021 | 10:04 AM

గ్రీస్ దేశం మంటల్లో మండిపోతోంది. కార్చిచ్చు చుట్టుముట్టడంతో అనేక ప్రాంతాల్లో వేలాది కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. నగరాలకు నగరాలు మంటల ధాటికి త;ల్లడిల్లుతున్నాయి. సుమారు 1500 గ్రీస్ ఫైర్ ఫైటర్లు, 15 విమానాలు, హెలికాఫ్టర్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారీ వర్షాలు పడుతున్నప్పటికీ అగ్ని కీలల ధాటికి దేశం కకావికలమవుతోందని ఈ వర్గాలు వెల్లడించాయి. తమ దేశం నుంచి అత్యంత అనుభవజ్ఞులైన ఫైర్ ఫైటర్లను పంపుతున్నట్ట్టు బ్రిటన్ విదేశాంగ మంత్రి ప్రీతీ పటేల్ తెలిపారు. ఆ దేశానికి ఇంతటి ఘోర విపత్తు ఎన్నడూ రాలేదని అన్నారు. శనివారం పెను గాలులు కూడా మంటలకు తోడయ్యాయి. నిన్న 100 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదైనట్టు గ్రీస్ వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రిటన్ తో బాటు ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలు కూడా తమ సాయాన్ని ప్రకటించాయి. గత 10 రోజుల్లో 57 వేల హెక్టార్లు అగ్నికి ఆహుతైనట్టు యూరోపియన్ ఫారిన్ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తెలిపింది.

2008-2020 మధ్య కాలంలో ఇలాంటి విపత్తుకు 1700 హెక్టార్లు మాత్రం ఆహుతయ్యాయని ఈ విభాగం తెలిపింది. భారీ ఆస్తి నష్టం జరిగిందని గ్రీస్ ప్రధాని మిసోతకీస్ చెప్పారు. ప్రాణ నష్టం అంతగా లేకపోయినా ఈ విపత్తు కలిగించిన ఘోర నష్టం నుంచి తమ దేశం ఇప్పుడిప్పుడే కోలుకోజాలదన్నారు. మరో వైపు టర్కీ కూడా మంటల ధాటికి గురయింది. గత వారం రోజుల్లో 8 మంది మరణించగా అనేక చోట్ల అగ్నికీలలకు భవనాలు ఆహుతయ్యాయి. ఈ దేశంలోనూ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.