ఇంటర్నెట్ లో క్రైమ్ షో చూసి.. బొమ్మ తుపాకులు చూపి.. జువెల్లరీ షాపులో దోపిడీ యత్నం.. ఇద్దరి అరెస్ట్

రెయిన్ కోట్లు, ముఖాలకు మాస్కులు ధరించి ఇద్దరు దొంగలు ఢిల్లీలో ఓ జువెల్లరీ షాపును దోచుకోవడానికి యత్నించారు. అక్కడి సిబ్బందికి గన్స్ చూపి బెదిరించి నగదును, నగలను దోచుకోవడానికి యత్నించి..

ఇంటర్నెట్ లో  క్రైమ్ షో చూసి.. బొమ్మ తుపాకులు చూపి.. జువెల్లరీ షాపులో దోపిడీ యత్నం.. ఇద్దరి అరెస్ట్
2 Arrested For Allegedly Robbing Jewellery Shop


రెయిన్ కోట్లు, ముఖాలకు మాస్కులు ధరించి ఇద్దరు దొంగలు ఢిల్లీలో ఓ జువెల్లరీ షాపును దోచుకోవడానికి యత్నించారు. అక్కడి సిబ్బందికి గన్స్ చూపి బెదిరించి నగదును, నగలను దోచుకోవడానికి యత్నించి..చివరకు పోలీసులకు పట్టుబడిపోయారు. ఇంటరాగేట్ చేయగా వీరు చూపిన గన్స్ బొమ్మ తుపాకులని (టాయ్ గన్స్) తేలింది. ఇంటర్నెట్ లో ఓ క్రైమ్ షో చూసి దాని ప్రభావంతో తాము ఇలా దొంగతనాలకు, దోపిడీకి దిగుతున్నామని వారు చెప్పారట. వీరిని ధీరజ్, పంకజ్ గా గుర్తించారు. ఫేక్ నెంబరు కల్గిన స్కూటర్ పై తిరుగుతూ ఈ ఇద్దరూ పలు చోట్ల దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బీహార్ లోని మధు బన్ కు చెందిన ఈ ఇద్దరిలో ఒకడిని గతంలో హర్యానాలో, మరొకడ్ని నోయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే విడుదలై వచ్చి మళ్ళీ అదే దందా కొనసాగించారు. ఢిల్లీలో ఏకంగా ఓ జువెల్లరీ షాపునే టార్గెట్ చేసుకున్నారు. ఈ మధ్యే గ్రేటర్ కైలాష్ లో ఓ షాపును దోచుకుని పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

అప్పుడే వీరిపై కేసు దాఖలైందని ఖాకీలు చెప్పారు. వీరి నుంచి స్కూటర్. దొంగిలించిన కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నెట్ లో వచ్చే క్రైమ్ షోలు ఇలా వక్ర మార్గంలో యువతను, పిల్లలను ప్రేరేపిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఇద్దరూ తమ పేర్లలో ఉన్న సారూప్యత కారణంగా సన్నిహితులయ్యారని.. వీరిపై పాత కేసులతో బాటు కొత్తగా కూడా మరో కేసు నమోదు చేస్తామని వారన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఒలంపిక్స్ పతక విజేతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం..రెండు ఎయిర్ లైన్స్ సంస్థల ప్రకటన

Trailer Talk: అసలు సూర్యకు ఏమైంది.. అతను కనబడకుండా పోవడానికి కారణమేంటి? ఆసక్తికరంగా సునీల్‌ సినిమా ట్రైలర్‌.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu