AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-Kisan: సోమవారమే రైతుల ఖాతాల్లోకి ప్రధాన మంత్రి కిసాన్ నిధులు.. చెక్ చేసుకోవడం ఇలా.. 

దేశంలోని రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.

PM-Kisan: సోమవారమే రైతుల ఖాతాల్లోకి ప్రధాన మంత్రి కిసాన్ నిధులు.. చెక్ చేసుకోవడం ఇలా.. 
Pm Kisan
KVD Varma
|

Updated on: Aug 08, 2021 | 7:46 PM

Share

PM-Kisan: దేశంలోని రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు.   దీని ప్రకారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తదుపరి విడత ఆర్ధిక ప్రయోనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు అంటే సోమవారం ఆగస్ట్ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. వీరికి 19,500 కోట్లు ఈ కార్యక్రమం కింద విడుదల కానున్నాయి. ఇక రైతులకు సొమ్ములు విడుదల చేసే కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ రైతు లబ్ధిదరుఅల్థో సంభాశిస్తారు. అదేవిధంగా ఆయన దేశాప్రజాలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అంటే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద, సంవత్సరానికి 6000/- రూపాయల ఆర్థిక ప్రయోజనం అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమానమైన వాయిదాలలో అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో, ఇప్పటివరకూ 1.38 లక్షల కోట్లు రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.

ప్రధానమంత్రి కార్యాలయం చేసిన ట్వీట్ ఇదే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిందీ లేనిదీ ఎలా తనిఖీ చేయాలి?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారు తనకు సొమ్ములు బ్యాంకులో వచ్చినవీ లేనిదీ ఇలా తెలుసుకోవచ్చు.

దశ 1: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి.

దశ 2: హోమ్ పేజీలో ఉన్న ‘లబ్ధిదారుని స్థితి’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

దశ 3: ఇప్పుడు తెరుచుకునే విండోలో, ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.

దశ 4: ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘డేటాను పొందండి’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా

ఇక్కడ కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి

Also Read: Niraj Chopra Hair Style: ఒలింపిక్స్ కోసం నీరజ్ తనకిష్టమైన జుట్టునూ త్యాగం చేశాడు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Interstate Disputes: అసోం-మిజోరాం లానే.. మరిన్ని రాష్ట్రాల మధ్యా వివాదం ఉంది..ఎక్కడెక్కడ వివాదాలున్నాయంటే..

Follow Us
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..