Kanjarbhat gang: దక్షిణాది హైవేలపై విరుచుకుపడుతోన్న కంత్రీ.. కంజర్ భట్ ముఠా. స్కెచ్ వేశారంటే.. పంట పండాల్సిందే.!
అది మాములు ముఠా కాదు.. కంత్రీ.. కంజర్ భట్ ముఠా. స్కెచ్ వేశారంటే.. పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూర్, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్‌లో ఏకంగా కంటైనర్లే మాయం చేసే ఈ హైజాక్ ముఠా
Cell Phone Containers Theft Gang – Kanjarbhat goons: అది మాములు ముఠా కాదు.. కంత్రీ.. కంజర్ భట్ ముఠా. స్కెచ్ వేశారంటే.. పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూర్, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్‌లో ఏకంగా కంటైనర్లే మాయం చేసే ఈ హైజాక్ ముఠా ఖాకీలకే సవాల్‌గా మారింది. చిత్తూరు జిల్లా పోలీసుల సహకారంతో ఈ ముఠా ఆట కట్టించేందుకు తమిళనాడు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినాకూడా చిక్కకుండా దక్షిణాది రాష్ట్రాల్లో సెల్ ఫోన్ కంటైనర్లను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది ముఠా పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని హైవేలపై మొబైల్స్ ట్రాన్స్ పోర్ట్ చేసే కంటైనర్లను హైజాక్ చేస్తున్న ముఠా కోట్లాది రూపాయల సెల్ ఫోన్స్‌ను కాజేస్తోంది. దోచుకున్న సెల్ ఫోన్స్ ఇతర దేశాల్లో విక్రయిస్తున్న కంజర్ భట్ ముఠా చిక్కడు దొరకడన్నట్లు కంటైనర్లను ఛేజింగ్ చేస్తోంది. మహారాష్ట్ర లోని దేవాగ్ జిల్లా కంజర్ భట్ ప్రాంతానికి చెందిన ఈ ముఠా ఆగడాలు రాష్ట్రంలోని హైవేలపై కొనసాగుతున్నాయి. తమిళనాడులోని కాంచీపురం నుంచి మొబైల్ ఫోన్స్ పలు రాష్ట్రాలకు ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న కంటైనర్లను వరుసగా హైజాక్ చేస్తున్న ముఠా పోలీసులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్న కేసులను చేధించడం పోలీసులకు ఛాలెంజ్ గా మారింది. మూడు రోజుల క్రితం బెంగళూరు జాతీయ రహదారిపై కంజర్ భట్ ముఠా చేతిలో చోరీకి గురైన సెల్ ఫోన్స్ కంటైనర్ ఇప్పుడు కర్ణాటక పోలీసు యంత్రాంగానికి సవాల్ విసిరింది. కాంచీపురం నుంచి బెంగళూరుకు మొబైల్స్‌ను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న కంటైనర్ కోలార్ జిల్లా దేవరాయ సముద్ర వద్ద కంజర్ భట్ ముఠా హై జాక్ చేసింది.
కాంచీపురం నుంచి హైవేపై కంటైనర్‌ను ఫాలో అయిన ముఠా ఓవర్ టేక్ చేసి డ్రైవర్ పై దాడికి పాల్పడింది. సినీఫక్కీలో కంటైనర్‌ను హైజాక్ చేసి హైవేపై కొద్ది దూరం ప్రయాణం చేసింది. రన్నింగ్ లోనే కంటైనర్ లోని 6 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్స్‌ను చోరీ చేసి వాహనాన్ని డ్రైవర్ కు అప్పగించి ఉడాయించింది. ఈ పని చేసింది ఉత్తర భారత దేశానికి చెందిన దొంగల ముఠాగానే భావిస్తున్న కర్ణాటక పోలీసు యంత్రాంగం.. సెల్ ఫోన్స్ కంటైనర్ ను దోచుకున్న ముఠా ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు టీం లను ఏర్పాటు చేసింది.
చెన్నై బెంగళూరు హైవేలో సెల్ ఫోన్స్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న కంటైనర్ చోరీ పై చిత్తూరు పోలీసుల సహకారం తీసుకుంటోంది. కోలార్ ఎస్ పి కిషోర్ బాబు చిత్తూరు జిల్లా పోలీసులతో సంప్రదిస్తుండగా చోరీకి గురైన 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్స్ రికవరీకి ప్రయత్నిస్తోంది. ఇది కంజర్ భట్ ముఠా పనేననన్న పక్కా అనుమానంతో కొలార్ పోలీసు టీంలు సెర్చ్ చేస్తుండగా.. గతంలో చిత్తూరు జిల్లా నగరి వద్ద ఇదే తరహా చోరీ జరగడంతో చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో వ్యవహరించిన తీరును తెలుసుకొంటోంది. ఈ క్రమంలో చోరీ చేసిన మొబైల్స్‌ను సదరు ముఠా దుబాయ్‌లో అమ్మేసినట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు.