Ongole Thefts: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు. ఒంగోలులో దొంగలు బాగా తెలివి మీరిపోయారు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న చందంగా దొంగలు తెలివిమీరిపోయారు. మూడో కంటికి చిక్కకుండా చోరీ చేస్తున్నారు. ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. చేసేది ఎలాగూ దొంగతనమే.
Ongole Thieves: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న చందంగా దొంగలు తెలివిమీరిపోయారు. మూడో కంటికి చిక్కకుండా చోరీ చేస్తున్నారు. ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. చేసేది ఎలాగూ దొంగతనమే. అదేదో పక్కాగా చేస్తే.. చిక్కే ఉండదు కదా..! అనుకుంటూ ఎగ్జాక్ట్‌గా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు కేడీగాళ్లు.
ఇదే క్రమంలో ఇవాళ ఒంగోలులో దొంగలు రెండు బైక్ షోరూంలలో చోరీలకు పాల్పడ్డారు. ఈ రెండు చేసింది ఒకే ముఠా. ఏకంగా ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న షాపులకే కన్నమేసి సవాల్ విసిరారు. పయనీర్ హోండా షోరూంలోని మేనేజర్ గదిలో ఉన్న 28 వేల రూపాయల క్యాష్ ఎత్తుకెళ్లారు. పోతూపోతూ సీసీ కెమెరా దృశ్యాలు రికార్డైన హార్డ్‌డిస్క్‌లను కూడా ఎత్తుకెళ్ళారు. పోలీసులకు ఎలాంటి క్లూ వదల్లేదు.
ఇక వెంకటేశ్వరకాలనీలో ఉన్న మరో హీరో షోరూంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. డబ్బుల కోసం వెతికారు.. అయితే ఎక్కడా క్యాష్ చిక్కలేదు. అక్కడ కూడా హార్డ్‌డిస్క్‌లను లేపేశారు. దొంగలు రెండు చోట్ల బైక్ షాపులనే టార్గెట్ చేశారు.. రెండు చోట్ల హార్డ్‌డిస్క్‌లను తమతో తీసుకుపోయారు. ఈ చోరుల తెలివితేటలు చూసి పోలీసులే నివ్వెరపోతున్నారు.
వీళ్లకు చోరకళతోపాటు.. కాస్త టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉందంటున్నారు పోలీసులు. అందుకే పక్కాగా ప్లాన్ చేసి.. సైలెంట్‌గా పని కానిచ్చేశారని చెప్పుకొస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దొంగలను ఎలా పట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఖాకీలు.
Read also: Etela Rajender: మంత్రి హరీశ్ రావుకు ఈటల సవాల్..! వస్తారా.. రండి చూసుకుందామంటూ సవాల్