AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భర్తను చంపి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భార్య.. అసలు విషయంతో పోలీసుల షాక్!

తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. చెన్నైలో కన్న కూతరునే లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించిన భర్తను ఓ మహిళ సుత్తితో కొట్టి హత్య చేసింది

Crime News: భర్తను చంపి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భార్య.. అసలు విషయంతో పోలీసుల షాక్!
Crime
Balaraju Goud
|

Updated on: Jan 30, 2022 | 11:20 AM

Share

Chennai Woman hammers Husband to death: తమిళనాడు(Tamil Nadu)లో దారుణం వెలుగు చూసింది. చెన్నైలో కన్న కూతరునే లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించిన భర్తను ఓ మహిళ సుత్తితో కొట్టి హత్య చేసింది. అనంతరం హత్యకు ఉపయోగించిన సుత్తితో నేరుగా పోలీస్ స్టేషన్‌(Police Station) వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళపై ఐపిసి సెక్షన్ 302 (Murder) కింద కేసు నమోదు చేశారు. ఆమెను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని పులియంతోప్ డిసిపి ఐ ఈశ్వరన్ తెలిపారు. తన భర్త తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నందుకే ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆమె నేరం అంగీకరించారు.

కేరళకు చెందిన నిందితురాలు గత 20 ఏళ్లుగా ఉమ్మడి కుటుంబంలో జీవిస్తోంది. దాదాపు 50 సంవత్సరాల క్రితం, వృత్తిరీత్యా టైలర్ అయిన ఆమె మామగారు తమిళనాడు రాజధానికి మకాం మార్చారు. ఆమె భర్త ఇద్దరు నిరుద్యోగులు. వారికి ఇద్దరు సంతానం. వారి కుమార్తె కళాశాలలో చదువుతోంది. కుమారుడు 4వ తరగతి చదువుతున్నాడు. ఈ దంపతుల 20 ఏళ్ల కుమార్తె ఎక్కువగా తన తాతయ్యలతో నివసించేది. గురువారం రాత్రి తాతలు బంధువుల ఊరికి వెళ్లడంతో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నిద్రించింది. ఆమె నేలపై పడుకోగా, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మంచం మీద పడుకున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున కుమార్తె కేకలు వేయడంతో మహిళ నిద్ర లేచింది. తన భర్త కూతురుపై లైంగిక దాడికి యత్నిస్తున్నట్లు గుర్తించింది. వారి కొడుకు అతన్ని దూరంగా లాగడానికి ప్రయత్నించారు. భర్త ఆమెను, కొడుకును తోసేశాడు. దీంతో ఆమె సమీపంలో పడి ఉన్న సుత్తితో అతని తలపై సుత్తితో బలంగా కొట్టింది. ఇది అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా వెళ్లిన ఆమె, ఒట్టేరి పోలీస్ స్టేషన్‌లో పోలీసులను ఆశ్రయించింది.

పోలీసు ఇన్‌స్పెక్టర్ ప్రకారం, ఆమె ఆత్మరక్షణ కోసం తన జీవిత భాగస్వామిని చంపినందున ఆమెను పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. తరువాత వెళ్లడానికి అనుమతించారు. ఆత్మరక్షణే నేరానికి కారణమని నిర్ధారించేందుకు సాక్షుల నుంచి సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు సేకరిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.

Read Also… Wrinkles: 30 ఏళ్లు దాటితే ముఖంపై ముడతలు.. రక్షణ కోసం ఈ చర్యలు..?

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..