Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapuram: ఒంట్లో నలతగా ఉందని.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే ప్రసవించిన బాలిక.. ఎంక్వైరీ చేయగా

పాఠశాలలో విద్యార్థినికి మొహం వాచినట్లు, అనారోగ్యంగా కనిపించడంతో టీచర్లు బాలికను బంధువులను పిలిచి ఇంటికి పంపారు. రెండు రోజుల క్రితం తీవ్ర కడుపు నొప్పి రావటంతో ఆస్పత్రికి వెళ్దామని ఆటోలో బాలికను తీసుకుని తల్లిదండ్రులు బయల్దేరారు.

Anantapuram: ఒంట్లో నలతగా ఉందని.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే ప్రసవించిన బాలిక.. ఎంక్వైరీ చేయగా
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 30, 2022 | 11:56 AM

AP Crime News: అనంతపురం నగరంలో ఒక దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బడికెళ్లే బాలికపై రోజూ తీసుకెళ్లే ఆటోడ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక శనివారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆడ శిశువును ప్రసవించింది. బుక్కరాయసముద్రం(Bukkarayasamudram) మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలిక నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి నిత్యం పాఠశాలకు ఇతర విద్యార్థులతో కలిసి ఆటోలో వచ్చేది. బుక్కరాయసముద్రానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌ ఈ విద్యార్థులను పాఠశాలకు తీసుకురావటం, మళ్లీ ఇంటి దగ్గర దిగబెట్టడం చేసేవాడు. ఈ క్రమంలో అతడు.. బాలికపై కన్నేసి, పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, ఏడాదిగా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పాఠశాలలో విద్యార్థినికి మొహం వాచినట్లు, అనారోగ్యంగా కనిపించడంతో టీచర్లు బాలికను బంధువులను పిలిచి ఇంటికి పంపారు. రెండు రోజుల క్రితం తీవ్ర కడుపు నొప్పి రావటంతో ఆస్పత్రికి వెళ్దామని ఆటోలో బాలికను తీసుకుని తల్లిదండ్రులు బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే బాలిక శిశువును ప్రసవించింది. ప్రస్తుతం ఆ బాలిక అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఇప్పటికే వివాహమై, పిల్లలు కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీస్టేషన్‌లో ఫోక్సో చట్టం(Pocso Act) కింద కేసు నమోదు చేశారు.

Cheating

నిందితుడు

చూశారుగా..! ఆడిపిల్లల తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకు ఉండాలి. ఎటు నుంచి ఏ కామాంధుడు వచ్చి కాటు వేస్తాడో తెలీదు. ఏ వైపు నుంచి ఏ కీచకుడు వచ్చి చిదిమేస్తాడో తెలీదు. తస్మాత్ జాగ్రత్త..!

Also Read: Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం