Job Fraud: వీడు మాములోడు కాదు.. ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. రూ. కోట్లు వసూళ్లు..
Job Fraud: నిరుద్యోగుల అవసరాన్ని పెట్టుబడిగా మార్చుకొని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరిట మోసాలు జరుగుతున్నట్లు నిత్యం వార్తలు వస్తున్నా, మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు. సులభంగా ప్రభుత్వ ఉద్యోగం...
Job Fraud: నిరుద్యోగుల అవసరాన్ని పెట్టుబడిగా మార్చుకొని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరిట మోసాలు జరుగుతున్నట్లు నిత్యం వార్తలు వస్తున్నా, మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు. సులభంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాగే నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ ప్రబుద్ధుడు నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తవణంపల్లి పైమాఘం గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ అనే వ్యక్తి నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపుతూ డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. రైల్వే శాఖలో ఉద్యోగాల పేరుతో గత ఏడాది దాదాపు 20 మంది నుంచి ఏకంగా రూ. కోటికిపైగా వసూలు చేశాడు. ఈ క్రమంలోనే నిరుద్యోగులను నమ్మించేందుకు ఏకంగా ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కూడా సృష్టించాడు. అయితే మోస పోయామని తెలిసిన నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హేమంత్ అసలు రూపం బయటపడింది.
దీంతో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చిన హేమంత్ మళ్లీ మోసాలు ప్రారంభించాడు. తాజాగా అటవీ శాఖలో ఉద్యోగాల పేరుతో మరోసారి దందాకు తెర తీశాడు. బాధితుల ఫిర్యాదుతో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హేమంత్‌పై కేసు నమోదు చేశారు.
Also Read: Fish Pickle: ఆంధ్రా స్టైల్ లో అద్భుతమైన రుచితో చేపల నిల్వ పచ్చడిని తయారు చేసుకోండి ఇలా..