Vijayawada: విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. టీడీపీ నాయకుడి అరెస్ట్..

Vijayawada TDP Leader Arrest: లైంగిక వేదిపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని

Vijayawada: విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. టీడీపీ నాయకుడి అరెస్ట్..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 30, 2022 | 2:28 PM

Vijayawada TDP Leader Arrest: లైంగిక వేదిపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (Vijayawada) లో కలకలం రేపుతోంది. టీడీపీ నేత వినోద్ జైన్ అనే వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాలిక మృతికి ముందు సూసైడ్ నోట్ రాసింది. నోట్ ఆధారంగా ఫోక్సో కేసు నమోదు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. గత 2 నెలలుగా బాలిక (Girl) ను వేధిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలిక నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు తెలిపారు.

కాగా.. చిన్నారి మృతదేహాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. మార్చురీ దగ్గర బాలిక తల్లిదండ్రులను మంత్రి పరామర్శించారు. ఇదిలాఉంటే.. గత ఎన్నికల్లో టీడీపీ కార్పొరేటరుగా పోటీ చేసి వినోద్ ఓడిపోయినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.

Also Read:

Vijayawada Crime: ఆకతాయి వేధింపులు తాళలేక 14 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

Tirupati: తిరుపతిలో దారుణం.. జనసేన కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు..