AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: ఆ విషయంలో పవన్ కల్యాణ్, చిరంజీవి మౌనం వీడాలి.. కాపు నేతల డిమాండ్

Kapu Leaders: ఆంధ్రప్రదేశ్(Andhra Predesh) లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలపై అభ్యంతరం వినిపిస్తోండగా.. మరికొన్ని చోట్ల జిల్లా పేర్లను

Vijayawada: ఆ విషయంలో పవన్ కల్యాణ్, చిరంజీవి మౌనం వీడాలి..  కాపు నేతల డిమాండ్
Vangaveeti Ranga
Surya Kala
|

Updated on: Jan 30, 2022 | 1:48 PM

Share

Kapu Leaders: ఆంధ్రప్రదేశ్(Andhra Predesh) లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలపై అభ్యంతరం వినిపిస్తోండగా.. మరికొన్ని చోట్ల జిల్లా పేర్లను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ(Vijayawada)కు వంగవీటి రంగా(Vangaveeti Mohan Ranga) పేరు పెట్టాల‌నే డిమాండ్ తెరమీదకు వచ్చింది. తాజాగా రంగా రీ ఆర్గనైజేషన్ పేరిట విశాఖలోని ఓ హోటల్లో కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాధ రంగా రీ ఆర్గనైజేషన్ సభ్యులు గాదె బాలాజీ మాట్లాడుతూ.. విజయవాడ కు వంగవీటి రంగా పేరు పెట్టాలని సీఎం జగన్ ని కోరుకుతున్నామని చెప్పారు. ఈ విష‌యంపై చిరంజీవి, పవన్ క‌ల్యాణ్ కూడా స్పందించాల‌ని కోరారు.. విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశార‌ని గుర్తు చేసిన ఆయ‌న‌.. అందుకే ఆయ‌న పేరు పెట్ట‌డ‌మే స‌రైంది అంటున్నారు. ఎన్టీఆర్ గుడివాడలో పుట్టారు. అది మచిలీపట్నం జిల్లా .. కనుక విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టడం సరైన నిర్ణయమని పవన్ కళ్యాణ్, చిరంజీవి లు కూడా ఈ విషయం పై స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా రంగా చేసిన సేవలను గుర్తు చేస్తూ.. గుడివాడలో పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కోసం దీక్ష చేపట్టి రంగా చనిపోయారని.. విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశారన్నారు. అంతేకాదు మరో వైపు అనకాపల్లి కి కూడా గుడివాడ గురునాథ్ పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పవన్ కల్యాణ్ పెద్ద అన్న గా ఉంటామన్నారు.. కనీసం జిల్లాకువంగవీటి రంగా పేరు పెట్టకపోతే పెద్ద పాలేరు గా కూడా కాపులు ఉండలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కచ్చితంగా విజయవాడకు రంగా పేరు పెట్టి తీరాలన్నారు. చాలా మంది రంగా పేరు వాడుకుంటున్నారు తప్ప దీనిపై ఎవరు మాట్లాడం లేదన్నారు. చిరంజీవి సీఎం జగన్ దగ్గరకి వెళ్లి కేవలం సినిమా విషయమే కాకుండా ఈ విషయం పై మాట్లాడాలని సూచించారు కాపు నేతలు. తండ్రి పేరు పెట్టాలని వంగవీటి రాధ మాట్లాడకపోయినా అయన తరుపున మేము మాట్లాడుతున్నాం.. త్వరలోనే ఆయన కూడా మాతో కలిసి వస్తారని చెప్పారు.

కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది.. ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి జిల్లా కి అంబేద్కర్ పేరు, ఇతర జిల్లాలకు పేర్లు సూచించారు.. కృష్ణ జిల్లాకు మాత్రం వంగవీటి రంగా పేరు సూచించక పోవడం దారుణని ఆవేదన వ్యక్తం చేశారు గాదె బాలాజీ. అంతేకాదు ఇప్పటికైనా పవన్, చిరంజీవి మౌనం వీడాలని రంగ పేరు జిల్లాకు పెట్టేలా మాట్లాడని కాపు నేతల కోరారు. అంతేకాదు కృష్ణాజిల్లాకు రంగా పేరు పెట్టాలని రాష్టవ్యాప్తంగా సమావేశాలు పర్యటనలో చేపడతామన్నారు కాపు నేతలు.

Also Read:

 బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. రీజన్ ఎందుకంటే..

ఏనుగుతో ముద్దు ముద్దుగా ఆటలాడుతూ.. ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి.. వీడియో వైరల్‌