Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం

బ్రిటీష్ కాలంలో 1890లో తాగునీటి అవసరాల కోసం నిర్మించిన భూగర్భ మంచినీటి రిజర్వాయర్ ట్యాంక్ ఇపుడు వెలుగులోకి రావడంతో దాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.

Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం
Underground Reservoir
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 29, 2022 | 1:56 PM

Kadapa Underground Secrets: కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ రిజర్వాయర్(Underground Reservoir)ట్యాంక్ వెలుగులోకి వచ్చింది. చింతకొమ్మదిన్నె(Chinthakommadinne)మండలం ఊటుకూరు గ్రామం సమీపంలో 1890లో బ్రిటీష్ వారు నిర్మించిన రిజర్వాయర్ ట్యాంక్ వెలుగులోకి రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. 132 సంవత్సరాల క్రితం కడపను ఈస్ట్ ఇండియా కంపెనీ(East India Company)వారు పాలించిన సందర్భంలో తాగునీటి అవసరాల కోసం… ఊటుకూరు వద్ద పదిబోర్లు వేసి భూగర్భ రిజర్వాయర్ ట్యాంకులో నీటిని నిల్వ చేసుకునేవారు. అవసరమైనపుడు వాటిని గ్రావిటీ ద్వారా కడప కలెక్టరేట్ కు తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. అద్భుతమైన కట్టడంతో ఎలాంటి సిమెంటు, కాంక్రీటు వాడకుండా కేవలం గచ్చుతో నిర్మించిన ట్యాంకు నేటికి చెక్కుచెదరక పోవడం విశేషం.

 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో కాంక్రీటు, సిమెంటుతో కట్టడాలు, మంచినీటి ట్యాంకులు నిర్మించినా 50 ఏళ్లకే ప్రశ్నార్థకమవుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటిది దాదాపు 132 సంవత్సరాల కిందట… ఎలాంటి సిమెంటు వాడకం లేకుండా కేవలం సుద్ద గచ్చుతో నిర్మించిన భూగర్భ మంచినీటి ట్యాంకు అది. బ్రిటీష్ కాలంలో 1890లో తాగునీటి అవసరాల కోసం నిర్మించిన భూగర్భ మంచినీటి రిజర్వాయర్ ట్యాంక్ ఇపుడు వెలుగులోకి రావడంతో దాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రెవిన్యూ గ్రామ పరిధిలో లక్షల లీటర్ల సామర్థ్యంతో 1890లోనే భూగర్భ మంచినీటి ట్యాంక్ ను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిర్మించారు. బుగ్గవంక ప్రాజెక్టుకు సమీపంలోని బుగ్గశివాలయం వద్ద పదిబోర్లు వేసి… అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కడప నగరానికి గతంలో తాగునీటి సరఫరా జరిగేది. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బ్రిటీష్ పాలకులు ఇక్కడ భూగర్భ మంచినీటి ట్యాంక్ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఇది రెవిన్యూ రికార్డుల్లో కూడా మంటినీటి ట్యాంక్ గా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇక్కడి నుంచి కడప పాత కలెక్టర్ బంగ్లా వరకు నీటిని తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ భూగర్భ రిజర్వాయర్ ట్యాంకు నిర్మాణం చేపట్టిన విధానం చూస్తే ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తోంది. భూమి ఉపరితలంపైన ట్యాంకు కోసం ఏర్పాటు చేసిన 15 రంధ్రాలు ఉన్నాయి. గతంలో వాటికి ఇనుపమూతలు ఏర్పాటు చేసినా.. కాలక్రమేనా ఇవి చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. భూమి ఉపరితలంపై నున్న రంధ్రం నుంచి కిందికి దిగగానే అద్భుతమైన కట్టడాలతో లోపల సుందరంగా కనిపిస్తుంది నిర్మాణం. ఎలాంటి సిమెంటు, కాంక్రీటు లేకుండా కేవలం సుద్ధగచ్చుతో ట్యాంకు నిర్మాణం చేపట్టారు. ట్యాంకు లోపలికి నీళ్లు రావడానికి ఓ రంధ్రం… ట్యాంకు నుంచి బయటికి నీళ్ల తరలించేందుకు మరో రంధ్రం ఏర్పాటు చేశారు. లోపలిభాగంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్ విధానం కనిపిస్తోంది. గోతిక ఆర్చ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. లోపలి భాగంలో 11 వరసల్లో 44 వరకు గోతిక ఆర్చ్ లు కనిపిస్తున్నాయి. ఇది గవ్వసున్నంతో చేసిన గచ్చుతో నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఉండటం నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలకు నిదర్శనంగా కనిపిస్తోంది

ఇపుడు కడప నగరానికి పెన్నానదిలోని గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇవి లేని సమయంలో తొలుత కడపకు నీటిని సరఫరా చేసిన ప్రాంతం మాత్రం ఊటుకూరు వద్దనున్న ఈ బ్రిటీష్ కాలంనాటి మంచినీటి ట్యాంక్ ద్వారానే. గతంలో సిద్ధవటం జిల్లా కేంద్రం నుంచి కడపకు మారిన సమయంలో బ్రిటీష్ వారు తాగునీటి అవసరాల కోసం ఈ విధానం అవలంభించినట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ బొగ్గు ఇంజిన్ల ద్వారా నీటిని తరలించే వారని సిబ్బంది చెబుతున్నారు. ఇపుడు కూడా ఊటుకూరు వద్దనున్న సంప్ నుంచి పైపులైన్ల ద్వారా కడప ఎర్రముక్కపల్లె వరకు నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ ట్యాంకు మాత్రం వృథాగా కనిపిస్తోంది.

Also Read: Nellore District: పొలం పనులు చేస్తుండగా.. బయటపడ్డ 6 బీరువాలు, ఒక బైక్.. ఎంక్వైరీ చేయగా