పాద రక్షల ఘటనపై టీటీడీ సీరియస్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది సస్పెండ్
కలియుగ దేవుడు.. తిరుమలేశుడు.. ప్రపంచ ప్రఖ్యాతుడు. వందలు, వేల కిలోమీటర్లనుంచి, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి, అనేక వ్యయప్రయాసలకు ఓర్చి సప్తగిరులు ఎక్కే భక్తజనానికి ఒకే ఒక్క మనోవాంఛ.. శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం. అలాంటి చోట అపచారం జరిగితే.. ఊరుకుంటారా. సీరియస్ యాక్షన్‌కు సిద్ధమైంది.

కలియుగ దేవుడు.. తిరుమలేశుడు.. ప్రపంచ ప్రఖ్యాతుడు. వందలు, వేల కిలోమీటర్లనుంచి, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి, అనేక వ్యయప్రయాసలకు ఓర్చి సప్తగిరులు ఎక్కే భక్తజనానికి ఒకే ఒక్క మనోవాంఛ.. శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం. అలాంటి చోట అపచారం జరిగితే.. ఊరుకుంటారా. సీరియస్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఏకంగా ఏడుగురిని సస్పెండ్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం, మరో ఆరుగురిపై చర్యలకు సిఫార్సు చేసింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించింది. టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.
సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది:
చక్రపాణి (సీనియర్ అసిస్టెంట్)
వాసు (జూనియర్ అసిస్టెంట్)
సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది:
డి. బాలకృష్ణ
వసుమతి
టి. రాజేష్ కుమార్
కె. వెంకటేష్
ఎం. బాబు
సస్పెన్షన్‌కు ప్రతిపాదించి ఎస్పీఎఫ్ సిబ్బంది:
1. సి. రమణయ్య, ASI (ఇన్‌ఛార్జ్)
2. బి. నీలబాబు
3. డి.ఎస్.కె. ప్రసన్న
4. చ. సత్యనారాయణ
5. పోలి నాయుడు
6. ఎస్. శ్రీకాంత్.
అసలేం జరిగిందంటే..?
తిరుమలలో ముగ్గురు భక్తులు కాళ్లకు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహా ద్వారం వరకు వచ్చేశారు. మహాద్వారం వద్ద విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని గుర్తించి అడ్డుకున్నారు. చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని సూచించారు. దీంతో- ఆ ముగ్గురూ తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్యూ లైన్‌ను దాటుకుని ఈ ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహా ద్వారం వద్దకు ఎలా వచ్చారనేది తిరుమల తిరుపతి దేవస్థానం విచారణ చేపట్టి, చర్యలు చేపట్టింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..