బాసరలో ఏం జరుగుతోంది? సరస్వతీ అమ్మవారి కంటి ముందే ఏంటీ రగడ?
నిర్మల్ జిల్లా బాసరలో ఏం జరుగుతోంది? సరస్వతీ అమ్మవారి కంటి ముందే ఏంటీ రగడ? ఆలయంలో అక్షరం.. వేదపాఠశాల బీజాక్షరాల మధ్య జరిగే ఆధిపత్యపోరులో ఎవరి వాదన కరెక్టు? గోదారమ్మ ఒడ్డున జరిగే ఈ యుద్థాన్ని చూసి భక్తులే అవాక్కవుతున్నారు. వేద పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా బాసరలో ఏం జరుగుతోంది? సరస్వతీ అమ్మవారి కంటి ముందే ఏంటీ రగడ? ఆలయంలో అక్షరం.. వేదపాఠశాల బీజాక్షరాల మధ్య జరిగే ఆధిపత్యపోరులో ఎవరి వాదన కరెక్టు? గోదారమ్మ ఒడ్డున జరిగే ఈ యుద్థాన్ని చూసి భక్తులే అవాక్కవుతున్నారు.
అటు జ్ఞాన సర్వస్వతీ అమ్మవారి ఆలయంలో అక్షరాసభ్యాసం.. ఇటు వేదభారతీ పాఠశాలలో బీజాక్షరాలతో నాలుకపై అక్షరాభ్యాసం. రోజు రోజుకు వేద పాఠశాలకు డిమాండ్ పెరుగుతుండడంతో ఆలయాధికారులు ఇప్పటికి తేరుకున్నారు. ఎంతో శాస్త్రోక్తంగా.. వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిగే అక్షరాభ్యాసాన్ని కాదని.. బీజాక్షరాల వైపు భక్తులు వెళ్తుండడం పట్ల.. అర్చకులు, ఆలయ పెద్దలు, స్థానిక హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
వేదభారతి, వేద పాఠశాల కొన్నేళ్లుగా బాసరలో పిల్లలకు వేద పాఠాలు నేర్పుతోంది. అయితే 2009 నుంచి ఈ పాఠశాలతో నాలుకపై బీజాక్షరాల పేరుతో పిల్లలకు అక్షరాభ్యాసాన్ని కల్పిస్తున్నారు. బాసర వచ్చే భక్తులు అటు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించినా.. ఇక్కడ బీజాక్షరాలు రాయిస్తున్నారు. అయితే ఆ సమయంలో కొందరే వేదపాఠశాలకు వచ్చినా.. క్రమంగా బీజాక్షరాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాఠశాలకు క్యూకట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో సరస్వతి అమ్మవారి ఆలయ పెద్దలు ఈ బీజాక్షరాల విషయాన్ని ఖండించారు. వేద పాఠశాలలో ఎలాంటి శాస్త్రోక్తమైన అభ్యాసం లేకపోగా.. విపరీత పోకడకు దారితీశారని మండిపడ్డారు.
అయితే ఈ మధ్య వాట్సాప్‌లో ఆలయ అర్చకులకు వేద భారతి నిర్వాహకులకు మధ్య సయోధ్య అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిని ఖండిస్తున్నారు ఆలయ అర్చకులు. వేద భారతి పాఠశాలకు తాము వ్యతిరేకం కాదుకాని.. బీజాక్షరాలకు వ్యతిరేకమంటున్నారు. తాము 2009 నుంచి ఈ బీజాక్షరాలు రాస్తున్నామని.. ఇందులో తప్పేమీ లేదంటున్నారు వేదపాఠశాల నిర్వాహకులు విద్యానంద భారతి. మరోవైపు, లోకల్ హిందూ సంఘాలు మాత్రం వేదభారతి పాఠశాలపై విమర్శలు చేస్తున్నారు. వేదం పేరిట పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటున్నారు. గంగాహారతీ పేరిట గోదావరి ఘాట్ వద్ద విచిత్ర పూజలు చేస్తూ బాసర ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నారు.
ఇదిలావుంటే, ఈ ఏడాది మార్చి 21వ తేదీన వేద పాఠశాలలో వేద విద్యార్థి లోహిత్‌పై దాడి జరిగింది. ఇక ఏప్రిల్ 4వ తేదీన మణికంఠ అనే వేద విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో వేదం నిలిచిపోయింది. దీంతో వేద పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేద భారతి పాఠశాల నిర్వాహకులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటున్నారు. పూర్వ విద్యార్థులను విచారించండి ఒక విద్యార్థిని ఎందుకు చనిపోయింది నిగ్గు తేల్చి సరస్వతి దేవి పవిత్రతను కాపాడండి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..