Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Company Director: తనకు తెలియకుండానే కంపెనీ డైరెక్టర్‌గా అటెండర్‌.. అసలు విషయం తెలిసి షాక్‌!

Company Attender : ఆయన ఓ కంపెనీలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. పెద్దగా తెలియదు. అది కూడా రోజు వారి కూలిగా పని చేసే వ్యాక్తిగా ఆ కంపెనీ ఆఫీస్‌ అటెండర్‌గా పనియమించుకున్నారు. కానీ అతనికి తెలియకుండానే కంపెనీ డైరెక్టర్‌గా చేసేంది. ఇదేంటి అటెండర్‌ను డైరెక్టర్‌ చేయడం ఏంటిని అనుకుంటున్నారు. అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్‌ అవుతారు..

Company Director: తనకు తెలియకుండానే కంపెనీ డైరెక్టర్‌గా అటెండర్‌.. అసలు విషయం తెలిసి షాక్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 13, 2025 | 1:43 PM

ఓ కంపెనీలో పని చేస్తున్న అటెండర్‌ ఉన్నట్టుండి కంపెనీ డైరెక్టర్‌గా నియమిస్తే ఎలా ఉంటుంది..? ఎవరైనా అదృష్టం కలిసి వచ్చిందనుకుంటారు. అటెండర్‌ను డైరెక్టర్‌గా నియమించమేంటని చాలా మందికి కూడా షాక్‌ అవుతుంటారు. కానీ అసలు విషయం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయినట్లు ఈ అటెండర్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.. రోజువారీ కూలీగా పనిచేసే వ్యక్తిని అతనికి తెలియకుండానే ఒక కంపెనీకి డైరెక్టర్‌గా చేసి, అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు పొందడానికి ఉపయోగించిన స్టోరీ ఇది. మీరు కొన్ని సినిమాల్లో ఈ రకమైన థ్రిల్లింగ్ వ్యాపార స్టోరీలను చూసి ఉండవచ్చు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరిగింది . కంపెనీ డైరెక్టర్‌గా తాను చేయని తప్పుకు తెలియకుండానే ఫిర్యాదు చేయవలసి వచ్చిన వ్యక్తి పేరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన తస్లిమ్ ఆరిఫ్ ఖాన్.

తస్లీం ఆరిఫ్ ఖాన్ గ్రీన్‌బ్యాంక్ ఆగ్రో లిమిటెడ్‌లో ఆఫీస్ అటెండెంట్‌గా పనిచేసేవాడు. అది కూడా ఒక దినసరి కూలీగా. అతను ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి తెలియకుండానే అతని పేరును కంపెనీ డైరెక్టర్ పదవిలో చేర్చారు కొందరు. అతని సంతకాన్ని ఉపయోగించి డిజిటల్ సంతకం తయారు చేశారు. ఈ సంతకం 2011 నుండి 2014 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDలు) ద్వారా పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించడానికి ఉపయోగించారు.

నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDలు) అంటే కంపెనీకి చెందిన ఈక్విటీ షేర్‌లుగా మార్చలేని రుణ సాధనాలు. ఇవి కంపెనీకి దీర్ఘకాలిక మూలధనాన్ని సమకూర్చడానికి ఉపయోగిస్తారు. NCDలు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అందుకే ఇది పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయ మార్గంగా పరిగణిస్తారు. అయితే తస్లిమ్‌కు ఇవేవీ తెలియవు. ఇది జరిగినప్పుడు అతను కంపెనీలో పని చేస్తున్నట్లు కూడా లేదు. తస్లిమ్ సహా వివిధ కంపెనీ డైరెక్టర్ల సంతకాలను ఉపయోగించి NCDలను పంపిణీ చేశారు. అలాగే పెట్టుబడిదారుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు.

గోల్‌మాల్‌ను బయటపెట్టిన సెబీ:

200 కంటే ఎక్కువ మందికి NCDలు పంపిణీ చేసినట్లయితే అది పబ్లిక్ ఆఫర్ పరిధిలోకి వస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయడానికి అనుమతి పొందడంతో సహా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. గ్రీన్‌బ్యాంక్ ఆగ్రో లిమిటెడ్ అటువంటి నియమాలను పాటించలేదని సెబీ దృష్టికి వచ్చింది. దీంతో గోల్‌మాల్‌ను గుర్తించిన సెబీ దర్యాప్తు ప్రారంభించడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తస్లింకు ఇలాంటి విషయాలేమి తెలియవు. ఓ ఆఫీస్ లో అటెండర్‌గా ఉన్న తాను కంపెనీ డైరెక్టర్‌గా పేరు చేర్చడంపై షాక్‌కు గురయ్యాడు.

ఇది కూడా చదవండి: Business Idea: చేతి నిండా డబ్బులు.. ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదించే వ్యాపారం.. అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!

సెబీ దర్యాప్తు తర్వాత గ్రీన్‌బ్యాంక్ ఆగ్రోను 2018లో పెట్టుబడిదారుల డబ్బును తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. సంస్థ డైరెక్టర్లు, యజమానులకు సెబీ నోటీసు పంపింది. నియమ నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించింది సెబీ. పెట్టుబడిదారులు రూ.36.97 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కంపెనీ 13 మంది డైరెక్టర్లలో తస్లిం ఆరిఫ్ ఖాన్ పేరు కూడా ఉంది. అసలు మొత్తానికి అదనంగా సంవత్సరానికి %. SEBI ఆదేశం ప్రకారం 15% వార్షిక వడ్డీని చేర్చాలి. సెబీ ఆదేశాల తర్వాత తస్లింకు అసలు విషయం తెలిసింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన తస్లిం ఖాన్ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. అందుకే ఈ రోజుల్లో రకరకాల మోసాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇది కూడా చదవండి: Mango Man of India: ఒకే చెట్టుకు 350 రకాల మామిడి పండ్లు.. ఎలా సాధ్యం.. అతని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి