Mango Man of India: ఒకే చెట్టుకు 350 రకాల మామిడి పండ్లు.. ఎలా సాధ్యం.. అతని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
Mango Man of India: కలీముల్లా తోట పద్దతిని భారతదేశాన్నే కాకుండా దుబాయ్, ఇరాన్‌లకు కూడా చేరుకుంది. అక్కడి రైతులు, పరిశోధకులు ఈ చెట్టును చూడటానికి వచ్చి అంటుకట్టే పద్ధతిని నేర్చుకుంటున్నారు. 'నాకు అవకాశం దొరికితే, నేను ఎడారిలో కూడా మామిడి పండ్లు పండించగలను' అని కలీముల్లా అంటున్నారు..

Mango Man of India: మామిడి పండ్లలో రాజు అయితే, ఆ రాజు కీర్తిని పెంచే ముత్యాల హారాన్ని తయారు చేసే అత్యుత్తమ కళాకారుడు కలీముల్లా ఖాన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 84 ఏళ్ల కలీముల్లా ఖాన్ కథ ఒక సైన్స్ ల్యాబ్ నుండి కాదు, ఉత్తరప్రదేశ్‌లోని ఒక మామిడి తోట నుండి ప్రారంభమవుతుంది. ఏడో తరగతిలో ఫెయిల్ అయిన ఒక బాలుడు చదువు మానేసి తోటల్లో గడపడం ప్రారంభించాడు. అదే బాలుడు నేడు ‘భారతదేశ మామిడి మనిషి’గా ప్రసిద్ధి చెందాడు. అతని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉంది. అతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. కానీ అతను తనను తాను శాస్త్రవేత్తగా లేదా ప్రముఖుడిగా భావించడు. అతనికి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం. కలీముల్లా ఖాన్ తన ఈ గుర్తింపును మాత్రమే ఇష్టపడతాడు.
మామిడి పండ్లతో జీవితం
యూపీలోని మలిహాబాద్‌లో తన తోటలో కలీముల్లా ఖాన్ ఎవరూ ఊహించనిది చేసాడు. ఒకే చెట్టుకు 350 కి పైగా రకాల మామిడి పండ్లు. ఇది మాయాజాలం కాదు, శతాబ్దాల నాటి అంటుకట్టుట సాంకేతికత. కలీముల్లా తన కృషి, ప్రయోగాలతో దానిని కొత్త శిఖరాలకు చేర్చాడు. 1957లో అతను మొదటిసారిగా ఒకే చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లను పండించడానికి ప్రయత్నించాడు. కానీ వరదలు అన్నింటినీ నాశనం చేశాయి. ఆ వినాశనం నుండే అతను భూమి, నీటిని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నాడు. అతను వైఫల్యాన్ని ఒక ప్రయోగశాలగా చేసుకుని ప్రకృతితో సంభాషించడం ప్రారంభించాడు.
125 ఏళ్ల చెట్టు
ఈ రోజు కలీముల్లా ఖాన్ తోట కిరీటంగా ఉన్న చెట్టు అతని తాత కాలం నుండి 125 సంవత్సరాల వయస్సు గలది. ఇందులో దుస్సెహ్రీ, లాంగ్డా, కేసర్, చౌన్సా, అల్ఫోన్సో వంటి సాంప్రదాయ రకాలు ఉన్నాయి. దీనితో పాటు, ‘నరేంద్ర మోడీ’, ‘ఐశ్వర్య రాయ్’, ‘సచిన్ టెండూల్కర్’, ‘అనార్కలి’ వంటి ప్రత్యేక పేర్లతో రకాలు కూడా పెరుగుతాయి. ఈ పేర్లు కేవలం ప్రచారం కోసం కాదు, వారి హృదయాల భావాలతో ముడిపడి ఉన్నాయి.

Kalimullah Khan
కలీముల్లా ది బెటర్ ఇండియాతో మాట్లాడుతూ, ‘ప్రజలు నన్ను స్వయం శిక్షణ పొందిన శాస్త్రవేత్త అని పిలుస్తారు. కానీ ఇది నిజం కాదు. నిజం చెప్పాలంటే చెట్లు నాకు ఇది నేర్పించాయి. అంతే తప్ప నేను శిక్షణ పొందిన శాస్త్రవేత్తనేమి కాదంటున్నారు.
అంటుకట్టుట ఒక ప్రత్యేకమైన నైపుణ్యం
అంటుకట్టడం అంత తేలికైన పని కాదు. ఈ ప్రక్రియలో ఇతర రకాల కొమ్మలను చెట్టు బలమైన కాండానికి కలుపుతారు. కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి 10-12 సంవత్సరాలు పట్టవచ్చు.దీనికి శాస్త్రీయ అవగాహన మాత్రమే కాకుండా చాలా ఓపిక కూడా అవసరం. ఉదాహరణకు, ‘దసహ్రీ-కలిమ్’ రకాన్ని అభివృద్ధి చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది. వాటి చెట్టు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది.
ఇది భారతదేశం నుండి విదేశాలకు..
నేడు కలీముల్లా తోట పద్దతిని భారతదేశాన్నే కాకుండా దుబాయ్, ఇరాన్‌లకు కూడా చేరుకుంది. అక్కడి రైతులు, పరిశోధకులు ఈ చెట్టును చూడటానికి వచ్చి అంటుకట్టే పద్ధతిని నేర్చుకుంటున్నారు. ‘నాకు అవకాశం దొరికితే, నేను ఎడారిలో కూడా మామిడి పండ్లు పండించగలను’ అని కలీముల్లా అంటున్నారు. కలీముల్లా ఖాన్ కథ కేవలం తోటపని గురించి మాత్రమే కాదు. ఇది భూమితో తన సంబంధాలను తెంచుకోని వ్యక్తి కథ.

Kalimullah Khan has created a mango tree that bears 350 varieties of mangoes
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి