ఏపీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.. ఏకంగా ఫస్ట్ ర్యాంక్!
ప్రైవేట్ కాలేజీలే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ర్యాంకులు సాధించ వచ్చు అంటున్నారు మైలవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు.. బైపీసీలో స్టేట్ ఫస్ట్ సాధించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్టేట్ ర్యాంక్ సాధించడంపై కాలేజీ టీచర్లు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి లేని విద్య అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకులు సాధించామంటున్నారు విద్యార్థినిలు.

ప్రైవేట్ కాలేజీలే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ర్యాంకులు సాధించ వచ్చు అంటున్నారు మైలవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు.. బైపీసీలో స్టేట్ ఫస్ట్ సాధించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం విద్యార్థులు సత్తా చాటారు. మైలవరం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్లస్‌లో బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ను సాధించారు. రాష్ట్రంలో 294 జెడ్పీ హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది మైలవరం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్. బైపీసీలో హరిణి 978, షాజిదా 976, లీనా 933 మార్కులు సాధించి ప్రభుత్వ ఇంటర్ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. స్టేట్ ర్యాంక్ సాధించడంపై కాలేజీ టీచర్లు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి లేని విద్య అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకులు సాధించామంటున్నారు విద్యార్థినిలు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏ మాత్రం తీసిపోవని నిరూపించిన మైలవరం హైస్కూల్ ప్లస్ విద్యార్థుల్ని అంతా అభినందిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివి కూడా ర్యాంకులు సాధించవచ్చని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..