Watch: కసోల్ వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా.. 31 మందికి గాయాలు.. ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయంటే..
బస్సు డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.. తదుపరి చికిత్స కోసం అతన్ని నెర్చోక్ మెడికల్ కాలేజీలో చేర్చారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సమీపంలోని చండీగఢ్-మనాలీ హైవేపై టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 31 మంది గాయపడ్డారని అక్కడి అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) మండి సాగర్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో కులు జిల్లాలోని పార్వతి లోయలోని కసోల్ వైపు వెళుతున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Himachal Pradesh: A tourist bus overturned near Mandi town on the Chandigarh-Manali Highway at around 4:00 AM. The bus was en route to Kasol (Kullu-Manali) when the accident took place. A total of 31 passengers (including driver and conductor) sustained injuries. Two… pic.twitter.com/ylWP1QcQCn
— ANI (@ANI) April 13, 2025
బస్సు డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.. తదుపరి చికిత్స కోసం అతన్ని నెర్చోక్ మెడికల్ కాలేజీలో చేర్చారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..