ఇది ఆటోనా లేక కదిలే ఫైవ్ స్టార్ హోటలా..? లోపల చూసి స్టన్ అవ్వాల్సిందే..
అయితే, ఈ ఆటో లోపలి దృశ్యాన్ని పరిశీలించినట్టయితే..ఉచిత Wi-Fi అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో ప్రయాణీకులకు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.ఇది కేవలం ఆటో కాదు, ఎమిరేట్స్ విమానం..అంటూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఆటో.. ఇది పేదవాడి కారు అని పిలుస్తారు.. కానీ, నేడు ఆ పరిస్థితి మారిపోయింది.. ఓలా, ఉబెర్ వంటివి అందుబాటులోకి వచ్చాకా పేద, ధనిక అనే తేడా లేదు.. ఒక్క క్లిక్‌తో కోరుకున్న బైక్, ఆటో, కారు ఇంటి ముందుకే వచ్చి వాలుతున్నాయి. దీంతో ప్రజల ప్రయాణం కూడా సుఖవంతంగా మారింది. ఇకపోతే, ఆటోల విషయానికి వస్తే.. కొందరు ఆటో డ్రైవర్లు వేరే లెవల్ అని చెప్పాలి. ఎందుకంటే.. కొందరు ఆటోవాలాలు తమ వాహనాన్ని, అందులో ప్రయాణించే వారిని ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారు. అలాంటి వీడియోలు, ఫోటోలు కూడా గతంలో అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటిదే ఇప్పుడు మరోక ఆటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ ఆటోలో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలు ప్రయాణికుల్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దాంతో ఈ ఆటో విషయం ఇప్పుడు ప్రత్యేకించి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆటోలో ఉచిత వై-ఫైతో సహా అనేక సౌకర్యాలు కల్పించబడ్డాయి. దాని లోపల చాలా టాబ్లెట్లు, మ్యాగజైన్లు కూడా ఉన్నాయి. ఈ వీడియో ‘AVIATION NEWS’ అనే ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఆ వీడియో క్యాప్షన్ ఇలా ఉంది.. మీ దగ్గర ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కోసం డబ్బు లేకపోవచ్చు, కానీ మీరు దీన్ని ఖచ్చితంగా భరించగలరు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
అయితే, ఈ ఆటో లోపలి దృశ్యాన్ని పరిశీలించినట్టయితే..ఉచిత Wi-Fi అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో ప్రయాణీకులకు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.ఇది కేవలం ఆటో కాదు, ఎమిరేట్స్ విమానం..అంటూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..