ఎండలో ఎలా తాగేది..? వైన్‌షాపులో సౌకర్యాలు లేక మందుబాబుల ఆందోళన.. ఏం చేశారంటే..
షాపు షట్టర్ మూసివేసిన మద్యంప్రియులు తమ నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాప్ ఓనర్ రావాలని తను వచ్చేవరకు షట్టర్ ఓపెన్ చేసేది లేదని సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఫ్యాన్లు లేక, పక్కనే ఉన్న టాయిలెట్స్ తో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు.

వైన్ షాప్ లో కనీస సౌకర్యాలు లేవంటూ ఆందోళనకు దిగారు మందుబాబులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని నాగ వైన్స్ షాపులో మద్యం కొనుగోలు చేసి, పర్మిట్ రూంలో వైన్ సేవిస్తున్నారు మందుబాబులు. అసలే వేసవికాలం.. గత రెండు నెలలుగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ హంగామా చేశారు మందుబాబులు. పర్మిట్ రూమ్ రేకుల షెడ్డు అందులో ఫ్యాన్లు లేకపోవడంతో తమకు ఉక్కపోస్తుందని, పక్కనే టాయిలెట్స్ దుర్వాసన వస్తుందని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వైన్ షాపు షట్టర్ క్లోజ్ చేశారు. షాపులో పనిచేసే వారు ఉండగానే షట్టర్ మూసివేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
సుమారు రెండు గంటల పాటు మద్యం షాపు షట్టర్ మూసివేసిన మద్యంప్రియులు తమ నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాప్ ఓనర్ రావాలని తను వచ్చేవరకు షట్టర్ ఓపెన్ చేసేది లేదని సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఫ్యాన్లు లేక, పక్కనే ఉన్న టాయిలెట్స్ తో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..