అయ్యో పాపం.. దారితప్పి ఊళ్లోకి వచ్చిన ఎలుగు బంటిపై అమానుషం..
మొత్తంగా అది కొన్ని గంటల పాటు విలవిల్లాడుతుంటే.. అక్కడున్న వారు చోద్యం చూస్తు, వీడియోలు తీస్తు ఉండిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఎలుగు బంటిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. చివరకు ఆ ఎలుగు బంటి అక్కడే ప్రాణాలు విడిచింది. మొత్తంగా ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అడవులు అంతరించి పోతుండటంతో వన్యప్రాణులు, అడవి జంతువులు ఆవాసం కోల్పోతున్నాయి. తిండి, నీళ్ల కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి. దాంతో వాటి వల్ల మనుషులకు , లేదంటే, మనుషుల వల్ల జంతువులకు హాని కలిగే సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అడవిలోంచి దారి తప్పిన ఓ ఎలుగబంటి సమీపంలోని గ్రామంలోకి ప్రవేశించింది.. దిక్కులేక ఊర్లోకి వచ్చిన ఆ నోరులేని జీవిని అక్కడి గ్రామస్తులు చిత్ర హింసలు పెట్టారు. దారి తప్పి ఊరిలోకి ప్రవేశించిన ఒక ఎలుగుబంటిపై కొందరు గ్రామస్థులు కర్కశంగా ప్రవర్తించారు. పైగా, ఆ దారుణం అంతా వీడియోలు తీశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఒక గ్రామంలోకి వచ్చిన ఎలుగును కొందరు గ్రామస్థులు బంధించారు. దాన్ని అక్కడున్న పెద్ద కర్రకు కట్టేసి.. దాని మీద కూర్చుని నోరు విరిచేశారు. అంతటితో ఆగలేదు.. అది బాధతో విలవిల్లాడుతుంటే.. దాని కాళ్ల గోర్లుసైతం విరగొట్టారు. ఆ మూగ జీవి నొప్పితో విలవిలలాడుతున్నా కనికరించలేదు. ఆ వీడియో SMలో వైరల్ అవుతోంది. స్పందించిన అటవీ అధికారులు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. ఆచూకీ గుర్తించిన వారికి రూ.10 వేలు బహుమానంగా ప్రకటించారు.
మొత్తంగా అది కొన్ని గంటల పాటు విలవిల్లాడుతుంటే.. అక్కడున్న వారు చోద్యం చూస్తు, వీడియోలు తీస్తు ఉండిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఎలుగు బంటిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. చివరకు ఆ ఎలుగు బంటి అక్కడే ప్రాణాలు విడిచింది. మొత్తంగా ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..