AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షకు పైగా ఖర్చుపెట్టి.. ప్రతి వారం 6500 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది! ఎందుకో తెలిస్తే..

30 ఏళ్ల నాట్ సెడిల్లో, న్యూయార్క్‌లోని కళాశాల చదువు కోసం వారానికి 6500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. న్యూయార్క్‌లో నివసించడం కంటే వారానికి ఒకసారి వెళ్లి రావడం ఆర్థికంగా లాభదాయకమని ఆమె చెబుతుంది. జనవరి నుండి ఇప్పటివరకు ప్రయాణం, వసతి, ఆహారం కోసం రూ.1.7 లక్షలు ఖర్చు చేసింది. ఆమె నిర్ణయం ఆమెకు ఆర్థికంగా సహాయపడుతుంది.

లక్షకు పైగా ఖర్చుపెట్టి.. ప్రతి వారం 6500 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది! ఎందుకో తెలిస్తే..
Nat Sedillo
SN Pasha
|

Updated on: Apr 12, 2025 | 9:12 PM

Share

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రతి వారం ఏకంగా 6500 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అది కూడా ఏకంగా లక్ష రూపాయాలు ఖర్చు చేస్తూ.. అంత దూరం, ప్రతివారం ఎందుకు వెళ్తుందని అనుకుంటున్నారా? ఎందుకో తెలిస్తే మీరు కూడా శభాష్‌ అంటారు. ఆమె తన చదువు కోసం వారానికి ఆరు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. 30 ఏళ్ల నాట్ సెడిల్లో, ఆమె భర్త శాంటియాగో అమెరికాలోని మెక్సికో నగరంలో నివసిస్తున్నారు. సెడిల్లో వారానికి ఒకసారి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌కు చదువుకోవడానికి వెళ్లి అదే రోజు సాయంత్రం అక్కడి నుండి తిరిగి వస్తుంది. ఈ విధంగా, ఆమె తన చదువు కోసం వారానికి 6500 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుండవచ్చు, అంత దూరం ఎందుకు ప్రయాణించాలి, అక్కడే ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న తలెత్తవచ్చు.

దీని గురించి సెడిల్లో మాట్లాడుతూ.. న్యూయార్క్ మెక్సికో కంటే చాలా ఖరీదైన ప్రాంతం. అక్కడే ఉండటం కంటే.. వారానికి ఒకసారి వెళ్లి రావడం తక్కువ ఖర్చు అవుతుంది. నా ప్రయాణం సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమవుతుంది, రోజంతా కళాశాలలో చదివిన తర్వాత, నేను మంగళవారం సాయంత్రం విమానాశ్రయంలో గడిపి, మెక్సికోలోని నా ఇంటికి అర్థరాత్రి విమానంలో వెళ్తాను. జనవరి నుండి ఇప్పటివరకు నాట్ తన ప్రయాణం, వసతి, ఆహారం కోసం రూ.1.7 లక్షలకు పైగా ఖర్చు చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.