AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి చెట్లకు కల్యాణం.. ఇదో వింత ఆచారం.. ఆసక్తిగా తిలకించిన స్థానికులు..

ఇందులో భాగంగా గ్రామస్థులను, బంధువులను తోటకు ఆహ్వానించి సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు రైతు దంపతులు. బీర్ పూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధు కుమారా చార్యులు వేద మంత్రోఛ్చారణల నడుమ మామిడి చెట్లకు వివాహం కొనసాగింది. మొదటి కాత సమయం లో..ఈ విధంగా పెళ్లి ని నిర్వహిస్తారు.. ఇలా మామిడి చెట్ల కు పెళ్లి నిర్వహిస్తే..

మామిడి చెట్లకు కల్యాణం.. ఇదో వింత ఆచారం.. ఆసక్తిగా తిలకించిన స్థానికులు..
Mango Trees Marriage
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Apr 13, 2025 | 9:36 AM

వైవాహిక బంధంతో ఒక్కటయ్యే దంపతులకు మాత్రమే పెళ్లి తంతు నిర్వహిస్తుంటారు. చూపులు కలిసిన తరువాత పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించే ఆనవాయితీ మనుషులకు మాత్రమే కొనసాగుతుంటుంది. ప్రత్యేకమైన సందర్భాల్లో ఇతర జీవరాశులకు కూడా పెళ్లిల్లు చేసే సాంప్రాదాయం ఉన్నప్పటికీ వృక్షాలకు వివాహాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మానవాళి మనుగడలో అత్యంత కీలక భూమిక పోషించే చెట్లను ఆదరించడమే కాకుండా వాటికి కూడా పెళ్లి చేసే విధానం కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా ఓ వింత పెళ్లి వెలుగులోకి వచ్చింది. రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశారు గ్రామస్తులు.. దీనికోసం ప్రత్యేక పూజలు చేసి ఆ రెండు మామిడి చెట్ల వివాహం ఘనంగా చేశారు. ఎక్కడ, ఏంటి అనే వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు మామిడి చెట్లకు పెళ్లి తంతు నిర్వహించారు. ఆక్సిజన్ అందించడమే కాకుండా ఫలాలను అందించే మామిడి చెట్లకు కూడా వివాహం జరిపించేందుకు రైతు చూపించిన ఆసక్తి పలువురిని ఆకట్టుకుంది. జిల్లాలోని బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామ రైతులు ఓగుల అనిల, అజయ్ దంపతులు తమ తోటలోని మామిడి చెట్లకు వివాహం ఘనంగా జరిపించారు. 8 ఎకరాల్లో వేసిన మామిడి తోట తొలిసారి నాలుగేళ్ల తరువాత తొలిసారి కాతకు రావడంతో మామిడి చెట్లకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇందులో భాగంగా గ్రామస్థులను, బంధువులను తోటకు ఆహ్వానించి సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు రైతు దంపతులు. బీర్ పూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధు కుమారా చార్యులు వేద మంత్రోఛ్చారణల నడుమ మామిడి చెట్లకు వివాహం కొనసాగింది. మొదటి కాత సమయం లో..ఈ విధంగా పెళ్లి ని నిర్వహిస్తారు.. ఇలా మామిడి చెట్ల కు పెళ్లి నిర్వహిస్తే.. మంచి దిగుబడి వస్తుందనే నమ్మకం.అంతేకాకుండా…మామిడి తోట..ఎప్పుడు పచ్చగా ఉంటుందనే నమ్మకం తో.. ఈ ప్రాంతం లో మామిడి చెట్లకు పెళ్లి జరపడం..ఆనావయితీ గా వస్తుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే