పిల్లులు కాదురోయ్.. పులులు అక్కడ.! బాబోయ్.. ఈ ముసలోడు మహా మొరుటోడు.. విషయం తెలిస్తే..
71 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో ఏడు బెంగాల్ పులులను పెంచుకున్నాడు. చివరకు విషయం అధికారుల దృష్టికి చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చెప్పిన సమాధానం విన్న పోలీసులు, అధికారులే కంగుతిన్నారు. పైగా సదరు వృద్ధుడికి ఈ బెంగాల్ టైగర్స్ ని పెంచుకోవడానికి అవసరమైన..

71 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో ఏడు బెంగాల్ పులులను పెంచుకున్నాడు. చివరకు విషయం అధికారుల దృష్టికి చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చెప్పిన సమాధానం విన్న పోలీసులు, అధికారులే కంగుతిన్నారు. ఈ సంఘటన అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో జరిగింది. అయితే, సదరు వృద్ధుడికి ఇలాంటి బెంగాల్ పులులను పెంచుకోవడానికి అవసరమైన లైసెన్స్ కూడా లేదని పోలీసులు మీడియాకు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కార్ల్ మైఖేల్ లాస్ వెగాస్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెవాడాలోని పహ్రంప్ నుండి వచ్చాడు. గత బుధవారం నై కౌంటీ డిప్యూటీలు ఏడు పులులను గుర్తించి కార్ల్‌ను అరెస్టు చేశారు. అయితే, కార్ల్ తన అరెస్టును ప్రతిఘటించాడని పోలీసులు తెలిపారు. పైగా అతని వద్ద తుపాకీ కూడా ఉందని పోలీసులు వివరించారు. కార్ల్ మైఖేల్ తన ఏడు బెంగాల్ పులులతో తన ఇంటికి సమీపంలోని ఎడారిలో నడుస్తుండగా అధికారుల కంటపడ్డాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడని పోలీసులు తెలిపారు.
కార్ల్ తన ఇంట్లో పులులు ఉన్నాయనే విషయం బయటకు చెప్పకుండా, అందరికీ కళ్లు గప్పి వాటిని పెంచుకుంటున్నట్టుగా అధికారులు వెల్లడించారు. అతను గత రెండేళ్లుగా అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని, కార్ల్ వద్ద పులులను పెంచుకోవడానికి ఎలాంటి లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు బృందం అతని ఇంటికి తనిఖీల కోసం వచ్చినప్పుడు అతను దానికి ఒప్పుకోలేదని చెప్పారు. చివరికి, SWAT బృందం పులులను పట్టుకుంది. ఏడు బెంగాల్ టైగర్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకోవటంతో కార్ల్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఈ పులులంటే తనకు ఎంతో ప్రాణం అని చెప్పాడు. వాటితో ఉంటే తనకు శాంతి, ఓదార్పునిస్తుందని చెప్పాడు. అవి జంతువులు కాదని, తనకు తన పిల్లల వంటివి అని ఆయన మీడియాతో అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..