AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగ'సిరి' మాయం.. పురుషుల్లో సంతానలేమికి కారణం ఏమిటి? వీడియో

మగ’సిరి’ మాయం.. పురుషుల్లో సంతానలేమికి కారణం ఏమిటి? వీడియో

Samatha J

|

Updated on: Apr 12, 2025 | 8:46 PM

కాలంతో పాటు మనుషుల జీవనశైలి మారుతోంది. అందుకు తగ్గట్లుగానే కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మగాళ్లలో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో ఫెర్టిలిటీ కేంద్రాలకు పురుషులు క్యూ కడుతున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకీ మెట్రో సిటీల్లో ఎక్కువ మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొనేందుకు కారణమేంటి. ? నేషనల్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్‌ఫెర్‌ డిపార్ట్‌మెంట్‌ రిసెర్చ్‌ లో ఏం తేలింది. ?

భాగ్యనగరంలో పరిస్థితి ఎలా ఉంది ? లెట్స్ వాచ్‌ దిస్‌ స్టోరీ..పెళ్లై చాలా కాలం అయినా దంపతులకు పిల్లలు కాలేదు అంటే అంతా స్త్రీ వైపే వెలెత్తి చూపే సమాజం మనది. కానీ కొన్నాళ్లుగా ఈ పరిస్థితి మారుతోంది. సంతానం కలగకపోవడానికి కారణం మగాళ్లు కూడా కావచ్చన్న అవగాహన పెరుగుతోంది. మరోవైపు మెట్రోపాలిటిన్‌ నగరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంపత్య జీవితంతో ఒక్కటైన కొత్త జంటలు తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తీరా చూస్తే పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు సంతానం ఆలస్యమవుతోందనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు. అయితే దేశంలో దాదాపు 50 శాతం నుంచి 60 శాతం మంది మగవారిని ఇన్‌ఫెర్టిలిటీ సమస్య వేధిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం

సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో

ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో

క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి