ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
ఈ మధ్యకాలంలో పాములు అక్కడ ఇక్కడ అని కాదు.. ఎక్కడికైనా వచ్చేస్తున్నాయి. ఆహారం కోసమో.. లేక ఆవాసం కోసమో.. జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కొన్ని ఇళ్లల్లోకి నేరుగా దూరిపోతుంటే.. మరికొన్ని ఏసీల్లోను, ఫ్రిజ్లలోను.. చొరబడుతున్నాయి. అలాంటి వింత అనుభవమే ఎదురైంది విశాఖ సిందియా లోని షిప్‌యార్డ్ ఉద్యోగి కుటుంబానికి. క్వార్టర్స్‌నుంచి షిఫ్ట్ అయ్యే క్రమంలో.. రిఫ్రిజిరేటర్ ను ఖాళీ చేశారు. అదే సమయంలో ఫ్రిడ్జ్ పై భాగంలో.. లోపల నుంచి ఏదో తొంగి చూస్తున్నట్టు గుర్తించారు. బల్లి అయి ఉంటుందని అనుకుని.. తరిమే ప్రయత్నం చేశారు. కానీ అది బల్లి కాదు.. పాము అని తెలిసి గుండె జారినంతపనైంది. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన నాగరాజు.. పామును పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసింది. అయితే నాగరాజు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఫ్రిజ్‌లోంచి దూకి పారిపోదామనుకున్న పాముకు షాకిస్తూ…అత్యంత చాకచక్యంగా దానిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును బ్రాంజ్ బ్యాక్ వైన్ స్నేక్ గా గుర్తించారు. చెట్లపై ఎక్కువగా నివసిస్తూ.. కప్పలు, బల్లులు, కీటకాలను తింటూ ఉంటుంది. ఇది నాన్ వెనమస్.. అంటే విషరహిత సర్పం. సగటున నాలుగు అడుగుల వరకు ఈ పాములు పెరుగుతాయి. చెట్లు పొదలు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి చాలా చురుగ్గా కదులుతూ.. దూకే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
వైరల్ వీడియోలు
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

