క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
నీట్‌కు సిద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఫాస్ట్ ఫుడ్ తిని మరణించింది. ఆమె మెదడులోకి క్యాబేజీలో ఉండే పురుగు ప్రవేశించడం వల్లే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా చుచైలా కలాన్ గ్రామ నివాసి ఇల్మా ఇంటర్ చదువుతూ నీట్ కు సిద్ధమవుతోంది. అయితే, ఇల్మాకు నెల రోజుల క్రితం టైఫాయిడ్ సోకింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. నోయిడాలోని ఆసుపత్రిలో ఆమెకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయగా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. మెదడులో 25కి పైగా ట్యూమర్లు భయపెట్టాయి. డాక్టర్లు ఇల్మా మెదడుకు ఆపరేషన్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న ఇల్మా మరణించింది. ఫుడ్ తినడం వల్ల క్యాబేజ్ ద్వారా ఆమె శరీరంలోకి పురుగులు ప్రవేశించడమే కారణమని తేలింది. ఈ పురుగు వల్ల ఆమె మెదడులో 25 ట్యూమర్లు ఏర్పడ్డాయని డాక్టర్లు తెలిపారు.
అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్‌లో టెస్ట్‌లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో ద్రవం పేరుకుపోయిందని తేలింది. చికిత్స చేసి ఆమె కడుపు నుంచి దాదాపు ఏడు లీటర్ల ద్రవాన్ని తొలగించారు. అయినా ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందుతున్న సమయంలో అహానా మరణించింది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
